పరిటాల సునీత నివాసంలో సోదాలపై స్పీకర్‌కు ఫిర్యాదు

హైదరాబాద్‌: పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండా తెదేపా ఎమ్మెల్యే పరిటాల సునీత నివాసంలో సోదాలు చేపట్టడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ అంశంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మహిళ పోలీసులు లేకుండా తన ఇంట్లో తనిఖీలు చేపట్టారని ఈ సందర్భంగా పరిటాల సునీత అన్నారు. కాంగ్రెస్‌ నేత సుధాకర్‌రెడ్డి హత్యకు కుట్ర పన్నారన్న కేసులో తన కుమారున్ని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. సుధాకర్‌రెడ్డి కుటుంబంతో మాకు ఎలాంటి శతృత్వం లేదని అయనే పలుమార్లు ప్రకటించారని గుర్తుచేశారు.