పరిసరాల పరిశుభ్రంతోనే వ్యాధుల దూరం

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌9(జనం సాక్షి ): ఏజెన్సీలో వర్షౄకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దోమలను నియంత్రించేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారులు తెలిపారు.ప్రధాన్‌ంగా అంటువ్యాధులకు దూరంగా ఉండాలన్నారు. అంటువ్యాధులకు దూరంగా పరిశుభ్రతలను పాటించాలని సూచించారు. దోమతెరలు వినియోగిస్తే దోమలు రావని అన్నారు. గ్రావిూణ ప్రాంత ప్రజలకు భారత ప్రభుత్వం అందించిన దోమతెరలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాఠశాలల విద్యార్థులు ముఖ్యంగా హాస్టళ్లలో ఉంటున్నవారు వీటిని వినయోగించుకుని మలేరియా తదితర వ్యాధులకు దూరంగా ఉండాలన్నారు. జ్వరాలు రావడానికి దోమలవ్యాప్తి , అపరిశుభ్రత అనే విషయాలపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు. దోమ తెరలు ప్రతీ విద్యార్థి వాడే విధంగా చూడాలని వైద్య సిబ్బందికి స్థానిక పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. గిరిజన గ్రామాల్లో జ్వరాలు వచ్చినపుడు వైద్యాధికారుల సూచనులు పాటించాలని అన్నారు. ఏజెన్సీలో మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలు తీవ్రతరం కావడానికి పారిశుధ్య లోపమే కారణమన్నారు. ప్రతి గిరిజన కుటుంబం ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుంటా చూడాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు రావని గుర్తించాలన్నారు.