పరీక్షా కేంద్రాలను సందర్శించిన వరంగల్ అర్బన్ ఎస్పీ
వరంగల్ : నగరంలో జేఈఈ మెయిన్స్ పరీక్ష ప్రారంభమైంది. పరీక్షా కేంద్రాలను వరంగల్ అర్బన్ ఎస్పీ సందర్శించారు. కేంద్రాల్లో సౌకర్యాలు, నగరంలో వసతులు ఎలా ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష సందర్భంగా నగరంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూశామని ఆయన తెలిపారు.