పర్యావరణాన్ని కాపాడుకుందాం మట్టి వినాయకులను పూజిద్దాం

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 30
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించాలని మచ్చ బొల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ అన్నారు. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ గణేష్ టెంపుల్ వద్ద జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ నాగమణి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరిగింది. సోమవారం ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రసాయనాలు వాడిన విగ్రహాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని మట్టి విగ్రహాలను పూజించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సూపరిండెంట్ హరిబాబు ఏ ఎం హెచ్ వో ప్రభాకర్, డివిజన్ అధ్యక్షులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, కొండల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఢిల్లీ పరమేష్, శోభన్, విష్ణు, వెంకటేష్, సతీష్, జస్వంత్, నారాయణ, కనకయ్య, జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది మహేందర్, తదితరులు పాల్గొన్నారు.