పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో మొక్కలే కీలకం

6వ వార్డు కౌన్సిలర్ మౌనిక శ్రీనివాస్
భూపాలపల్లి టౌన్ జులై 23, (జనం సాక్షి)
      వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో మొక్కలు కీలకపాత్ర పోషిస్తాయని ఆరవ వార్డు కౌన్సిలర్ మౌనిక శ్రీనివాస్ అన్నారు.
 జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు, క్రిష్ణకాలనీలో శనివారం హరితహారం కార్యక్రమంలో భాగముగా వార్డు కౌన్సిలర్ మౌనిక శ్రీనివాస్ కరాటే ఇంటికో మొక్కను అందజేశారు. ఈ సందర్భముగా మౌనిక శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో మొక్కలు కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు. మొక్కలు మనకు అవసరం లేని చెడు గాలి కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకొని, మనకు కావాల్సిన మంచి గాలి ఆక్సిజన్ ను అందజేస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని, హరితహారం కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ పి సంపూర్ణ, హెచ్ వి బృంద, ఏఎన్ఎం స్వప్న, ఆశా కార్యకర్తలు శ్రీలత, సునీత, సుమ, కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area