పర్యావరణ పరిరక్షణపై ప్రచారయుద్ధం అవసరం
ఇటీవలే జీవవైవిధ్య సదస్సు మన రాజధానిలో అట్టహాసంగా ముగసింది. పర్యావరణం, ప్రకీతి వైసరీత్యాలపై ఘనంగా చర్చించారు. పర్యావరణం దెబ్బతింటే కలిగే నష్టాలను చర్చించారు. ఇప్పుడు మనకు అవి కళ్లకు కనిపిస్తున్నాయి. పర్యావరణ సమతుల్యత లోపించడం, అడవులను విచ్చలవిడిగా నరకడం, సముద్రతీరంలో మడ అడవులను నరికి వేయడం, ఇసుకను ఇష్టా రాజ్యంగా తవ్వి పారేయడం, కొండలను పిండి చేయడం వల్ల ఇప్పుడు వరద ముప్పులను ఎదుర్కోవాల్సి వస్తోంది. అకాల వర్షాలను తట్టుకోలేని విధంగా నష్టాన్ని మూటకట్టుకుంటున్నాం. నీలం తుఫాన్ కారణంగా వరదలు పోటెత్తాయి. మడ అడవుల ప్రయోజనాలను ప్రజలు గుర్తించకుండా వారి స్వార్థం కోసం నరికి వేయడం వల్ల ఇవాళ సముద్రం నుంచి వచ్చే అలలు నేరుగా గ్రామాలపైకి దాడి చేస్తున్నాయి. ఈదురు గాలులును తట్టుకునే విధంగా ఉండే కొండలను కొట్టి వేయడం వల్ల పర్యావరణం దెబ్బతినడమే గాకుండా కాలంలో కూడా మార్పులు వస్తున్నాయి. చెట్లను విచ్చలవిడిగా నరికి వేస్తూ, అడవులను దెబ్బతీయడం వల్ల సకాలంలో వర్షాలు పడడం లేదు. తిరగి మొక్కలను నాటడంలో అశ్రద్ద కారణంగా అనర్థాలను ఎదుర్కొంటున్నాం. గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచ పర్యావరణంలో విపరీత మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల రుతువులు గతి తప్పాయి. కాల ప్రభావాలు కూడా విపరీత పరిస్థితులను కలిగి ఉంటున్నాయి. అందువల్ల వర్షాకాలం ఏదో, ఎండా కాలం ఏదో తెలుసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వరదలు, అకాల వర్షాలపై ఇస్రో పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలతో తీవ్రంగా నష్టపోయింది. అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షాలకు తోడు, కాలువలు తెగి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వరదలు రాష్టాన్న్రి అతలాకుతలం చేశాయి. ఈ హఠాత్పరిణామానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. వేలల్లో నష్టాన్ని చవిచూశాం. వరద ముప్పును, వర్షాల రాకను ముందే పసిగడితే ప్రమాదాల తీవ్రతను తగ్గించుకునే అవకాశం ఉంది. భూమి మొత్తంగా మైదానంగా మారుతూ పచ్చటి చెట్లు లేకుండా తయారవుతోంది. హిమాలయాలు కూడా కరిగే పరిస్థితి ఉత్పన్నమవుతోందని హెచ్చిరిస్తున్నారు శాష్దవ్రేత్తలు. గ్లోబల్ వార్మింగ్‌తో ప్రపంచంలో పరిస్థితులు మారిపోయిన దశలో ఓజోన్ పొర కరిగిపోతుందనేఆందోళన కలుగుతోంది. ఈ పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు అందరూ నడం బిగించాల్సి ఉంది. అందుకు ఇస్రో సహకారం తప్పనిసరి. ఇటీవల భారత అంతరిక్ష చరిత్రలో అపూర్వఘట్టాన్ని ఆవిష్కరించిన ఇస్రో ఆ వైపుగా కృషి చేయాల్సిన అవసరాన్ని మేధావులు, ప్రజలు కోరుతున్నారు. ఓషన్ శాట్ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్షంలో భారత్ పరిశోదనలకు చుక్కానిలా ఉంటుంది. ఓషన్‌షాట్‌తో పాటే వాతావరణ పరిస్థితులపై ఇప్పటికే అధ్యయనం జరుగుతోంది. ఇస్రో ఇప్పుడు తన దృష్టిని వాతావరణ పరిస్తితులపై నిలపాల్సి ఉంది. మనిషి మనుగడకు అత్యవసరమైన నీరు చంద్రుడి విూద ఉందని తేలింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయాన్ ఉపగ్రహం నీటిజాడలకు సంబంధించిన ఫోటోల్ని పంపింది. నాసా మ్యాపర్ తీసిన ఈ చిత్రాల్ని ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. ఈ ఉత్సాహంతో ఇస్రో చంద్రయాన్ టూర్‌కు సిద్దమయ్యింది. అయితే దానికన్నా ముందు వాతావరణంలో ఎప్పుడు ఏ మార్పులు సంభవిస్తున్నాయో తెలుసుకునే విధంగా పరిశోధనలు జరిగితే ఇటీవలి ఉపద్రవాలను ఎదుర్కోవచ్చన్నది పర్యావరణవేత్తల అభిప్రాయం. ఓజోన్ పొర , అకాల వర్షాల రాక, తదితరాలపై పరిశోధనలు కూడా అవసరం. సునామి లాంటి ఉపద్రవాలను కనుక్కోగలిగినప్పుడు ఇది కూడా సాధ్యం చేయవచ్చని అంటున్నారు. బహుశా ఇప్పటికే ఇస్రో ఇటీవలి వరదలపై ఓ అంచనాకు వచ్చివుంటుందనే ఆశ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్‌లోనూ తరచుగా వచ్చే ప్రమాదం లేకపోలేదు. వాతావరణ పరిస్థితులపై అధ్యయనం జరిగి ఉపద్రవాలను ముందే పసిగడుతున్నా నష్ట నివారణలో ముందుండలేకపోతున్నాం. అందువల్ల నష్టాలను నివారించడానికి గల కారణాలను విశ్లేషించాలి. అప్పుడే వరదలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు రంగంలోకి దిగే పరిస్తఙతి రాదు. గ్లోబల్ వార్మింగ్‌పై కూడా ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించాలి. కలిగే నష్టాన్ని వివరించాలి. ఇదో చైతన్య కార్యక్రమంగా కొనసాగాలి. యుద్ద ప్రాతిపదికన ప్రచారం చేయాలి. ప్రజలందరూ ఇందులో భాగస్వామలు అయ్యేలా చూడాలి. ప్రకృతిని కాపాడుకునే మహాయజ్ఞంలో అందరూ పాలుపంచుకుంటే తప్ప మన భూమిని మనం రక్షించుకోలేం. అందుకు ప్రభుత్వం మిషన్‌ను చేపట్టాలి. అప్పుడే పర్యావరణాన్ని రక్షించకునే వీలు కలుగుతుంది.