పర్యావరణ పరిరక్షణ కోసమే మట్టి విగ్రహాల పంపిణీ
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):పర్యావరణ పరిరక్షణ కోసమే మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు శ్రీ వాసవి మాత సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఈగ దయాకర్ గుప్త, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షులు మిర్యాల శివకుమార్, ప్రధాన కార్యదర్శి బొల్లం సురేష్, కోశాధికారి గుడిపాటి రమేష్ అన్నారు.మంగళవారం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ , శ్రీ వాసవి మాత సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక సాయి అపార్ట్మెంట్ నందు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మట్టి విగ్రహాల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఈగ దయాకర్ గుప్తా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇంటిలో పూజ చేసుకునే మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.అనంతరం స్ధానికులకు గణేష్ మట్డి విగ్రహాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో 200 మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు.కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కమిటీ సభ్యులు నరేంద్రుని. విద్యాసాగర్ రావు ,తాళ్లపల్లి రామయ్య , నూక వెంకటేశం గుప్త, గుండా శ్రీధర్, ఇల్లందుల జగన్, కర్నాటి శేఖర్, బెలీదే అంజయ్య, చల్లా సోమయ్య , ఈగ విజయలక్ష్మి , మిర్యాల కవిత , ఉప్పల మంజుల తదితరులు పాల్గొన్నారు.