పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, మన నిత్య జీవితంలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా చేతి సంచులను మాత్రమే వాడాలని గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షుడు ముప్పారపు నరేందర్, కార్యదర్శి డాక్టర్ తోట కిరణ్ అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్ లో జరిగిన గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఆరవ సర్వసభ్య సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను ప్రభుత్వం నిషేధించడం ఆహ్వానించాల్సిన విషయమని, దీనిని కట్టడి చేయడంలో ప్రభుత్వంతో పాటు గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సభ్యులు కూడా ముందుండాలని అన్నారు.గత కొద్దిరోజులుగా ట్రస్ట్ సభ్యుల సహకారంతో ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ఇంటింటికి చేతి సంచి అందించాలనే పట్టుదలతో కొన్ని గ్రామాలతో పాటు పట్టణంలోని కొన్ని వార్డులలో జ్యూట్ బ్యాగులను అందిస్తున్నామని తెలిపారు.చిన్న పిల్లలకు పర్యావరణ పరిరక్షణపై బాధ్యత , చెట్ల పెంపకంపై అవగాహన, ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలను తెలుపుతూ కొన్ని స్కూళ్లలో పిల్లలకు అవగాహన కల్పించామని తెలిపారు.జనవరి నుండి ఇప్పటి వరకు గ్రీన్ క్లబ్ ట్రస్ట్ చేసిన పనులను సభ్యులకు వివరించారు. గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడానికి మొక్కలను విరివిగా నాటాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.హాజరైన సభ్యులు మాట్లాడుతూ భవిష్యత్ లో పర్యావరణానికి మేలు చేకూర్చే పనులు ఇంకా చేపట్టి, ప్రజలకు, విధార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో గండూరి కృపాకర్, ఉప్పల శ్రవణ్ , ముప్పారపు నాగేశ్వరరావు ,రాచర్ల కమలాకర్ , కక్కిరేణి శ్రీనివాస్ , డాక్టర్ రామ్మూర్తి యాదవ్, బొలిశెట్టి మధు , బందు శ్రీధర్ బాబు , బహురోజు ఉపేందర్ , ఉప్పల శ్రీదేవి , అంజన్ ప్రసాద్ , డాక్టర్ భూమిరెడ్డి , మంచాల శ్రీధర్ , కవిత ,నూక రవిశంకర్ , డాక్టర్ శిరీష దంగ్డే తదితరులు పాల్గొన్నారు.