పర్వీన్‌ ఆజాద్‌ను పరామర్శించిన రాహుల్‌

ఓఎస్‌డీ ఉద్యోగం నాకొద్దు : అబ్దుల్‌హక్‌ భార్య
చండీగఢ్‌,మార్చి9(జనంసాక్షి):
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో హత్యకు గురైన పోలీసు అధికారి జియా వుల్‌హక్‌ భార్య పర్వీన్‌ ఆజాద్‌ను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పరామర్శించారు. డియోరియాకు చేరుకున్న ఆయన పర్వీన్‌ను ఓదార్చారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని హావిూ ఇచ్చారు. హత్యను రాహుతల్‌ తీవ్రంగా ఖండించారు. ఇది పిరికిపంద చర్య అని అన్నారు. రాహుల్‌ రాక సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జడ్‌ కేటగిరీలో ఉండడంతో భారీగా పోలీసులను మొహరించారు. రాహుల్‌ రాకతో స్థానిక కాంగ్రెస్‌ నేతలు హడావిడి చేశారు. యూపికి చెందిన మాజీ మంత్రి రాజా భయ్యా ఆదేశాల మేరకు ఈ హత్య జరిగినట్టు వార్తలువెలువడంతో ఉత్తరప్రదేశ్‌ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్న ఆయన రాజా భయ్యా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తరవాత హత్య కేసును సిబిఐ కి అప్పగించారు. యూపిలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఇందుకు డిఎస్పి హత్య నిదర్శనమని మాయావతి, బిజెపి ఆరోపించాయి.