పలు పాఠశాలలో నోట్ బుక్స్ పంపిణీ….
• బడుగు బలహీనర్గాలు చదువుతోనే అభివృద్ధి చెందుతాయి.
-తెరాస మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్.
• విద్యాదానం మహా దానం
– ఎంయివో నర్సమ్మ
దౌల్తాబాద్, జూలై 20,జనం సాక్షి.
మండల పరిధిలోని కోనాపూర్ , మల్లేశంపల్లి గ్రామాలలోని పాఠశాలలో విద్యార్థులకు శేరిపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్ మరియు సాయి వారి తండ్రి జ్ఞాపకార్థం నోట్ బుక్స్ ను తెరాస మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ మరియు ఎంయివో నర్సమ్మ చేతుల మీదుగా పంపిణీ చేసారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీనర్గాలకు చెందిన వారు కేవలం విధ్య వల్లే అభివృద్ది చెందుతాయని, పండగలు,సంబరాలకు అనవసరపు ఖర్చులు తగ్గించి ఎలాంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అల్లి శేఖర్ రెడ్డి,అయా గ్రామాల సర్పంచులు పంచమి స్వామి, దార సత్యనారాయణ, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బండారు దేవేందర్,ఎంపీటీసీ నవీన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పబ్బ అశోక్, ఉప సర్పంచ్ రాజిరెడ్డి,నాయకులు స్వామి,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.