పల్లెల అభివృద్ధికి ప్రభత్వం కృషి: ఎమ్మెల్యే సతీష్ కుమార్

జనంసాక్షి/ చిగురుమామిడి – సెప్టెంబర్22:
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో ఎక్కువగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు.గురువారం మండలంలోని ఇందుర్తి గ్రామంలో 31లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ప్రారంభించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు పల్లెల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని,
గతంలో పల్లెల అభివృద్ధికి ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది.కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయంతో పల్లెల్లో పచ్చదనం,పారిశుధ్యం వెల్లువిరుస్తుంది.పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులను అందజేయడం జరుగుతుంది.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 అవార్డులలో 19 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి.దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆసరా పెన్షన్లు,రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు అందజేయడం జరుగుతుంది.ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి.ఎన్నికల తర్వాత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ అందె స్వరూప స్వామి,ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ లు అందే స్వప్న స్వామి,చంద్రకళ రాంగోపాల్ రెడ్డి,ఉప సర్పంచ్ తోట సతీష్, వైస్ ఎంపీపీ రాజిరెడ్డి,పాక్స్ చైర్మన్ జంగా వెంకట రమణ రెడ్డి,వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి,ఎంపిడిఓ నర్సయ్య,లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదె రఘునాథ్ రెడ్డి, వార్డు సభ్యులు,నాయకులు,అధికారులు తదతరులు పాల్గొన్నారు.