పల్లె దవఖానలతో ప్రతి పేదవాడి ఆరోగ్యం మెరుగుపడుతుంద*
*అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం. అబ్రహం*
ఇటిక్యాల జులై 22 (జనంసాక్షి) పల్లె దావఖాన నిర్మాణంతో ప్రతి పేదవాడు ఆరోగ్యం మెరుగుపడుతుందని అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వి. ఎం అబ్రహంఅన్నారు. శుక్రవారం మండలం పరిధిలోని వావిలాల గ్రామంలో 16 లక్షల వ్యయంతో నిర్మించిన పల్లె దవఖాన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అబ్రహం ప్రారంభించారు.ఈ సదర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ పల్లె దవఖానల వల్ల ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పల్లె దవఖానలు ప్రజల సుస్తీని పోగొట్టి దోస్తీ దవఖానలుగా మారుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలు పైసాఖర్చు లేకుండా వైద్యపరీక్షలు, మందులు ఉచిత వైద్యాన్ని పొందాలన్నారు. కేసీఆర్ సహాయంతో అలంపూర్ నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి మంజూరై పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జయచంద్రారెడ్డి, తెరాస నాయకులు నీలి శ్రీనివాసులు, బ్రహ్మేశ్వర్ నాయుడు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.