పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 28 కొడేర్ మండల కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే,
కోడెర్ మండల కేంద్రంలోని దళిత వాడలో మంగళవారం రాత్రి “పల్లెనిద్ర” కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే.
దళితవాడలో పర్యటించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుని వారి సమస్యలను స్వయంగా పరిశీలించి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
అనంతరం కోడేర్ మండల కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే
కోడేరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై గతంలో వర్షాకాలం వస్తే వరి నాట్లు వేసి ప్రజలు నిరసన తెలిపే వారని..మీరు వచ్చాక ప్రత్యేక చొరవ తీసుకొని రెండు కోట్ల 65 లక్షలతో మెయిన్ రోడ్డు నిర్మాణం చేసినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
కోడేరు మండల కేంద్రంలో 38 రోడ్లు వేశామని ఇంకా అదనంగా నిధులు మంజూరు చేసి పూర్తిస్థాయిలో సైడ్ డ్రైనేజీలు, సిసి రోడ్లు నిర్మాణాలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.
కోడేరు మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులనుండి ఒక కోటి పది లక్షల రూపాయలతో కాలనీలలో రోడ్లు వేయించి సాధ్యం అయినంతవరకు రోడ్లు పూర్తి చేశామని,శివాలయం ఊరకుంట అలుగు దగ్గర రోడ్డు పై నీరు రావడంతో రాకపోకలకు ఇబ్బంది అవుతుందని తాత్కాలికంగా గూనలు ఏర్పాటు చేసాం అని ఈ రెండు మూడు రోజులలో బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలుస్తారని త్వరలో పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే గుట్టలో కాలనీవాసులను ఆప్యాయంగా పలకరించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.
మండల కేంద్రంలో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరామర్శించారు.
తదనంతరం ఎమ్మెల్యే మండల కేంద్రంలో కురుమయ్య టీ స్టాల్ దగ్గర గ్రామస్తులతో కలిసి టీ తాగి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అధికారులు ఎప్పటికప్పుడు కాలనీలను పర్యవేక్షించి శానిటేషన్ చేయాలని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు,అలాగే విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే
ఈ పల్లెనిద్ర కార్యక్రమం వలన అర్హులైన లబ్ధిదారులకు దళిత బంధు, ఇండ్లు, ఇతర సంక్షేమ పథకాలు ఇచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు కొల్లాపూర్ మార్కెట్ కమిటి చైర్మన్ ఆర్ కిషన్ నాయక్,టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సూర్య’రాజశేఖర్ గౌడ్, సింగల్ విండో డైరెక్టర్ యం జగన్ మోహన్ రెడ్డి,దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జగదీశ్వర్ రావు, మహేశ్వర్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ చిన్నారెడ్డి, ప్రజాప్రతినిధులు ,అధికారులు, తెరాస నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
Attachments area
|