పాకిస్థాన్‌లో పాఠశాలపై తాలిబన్ల నరమేథం

1

 

141 మంది మృతి, తరగతి గదుల్లో రక్తపుటేర్లు

హేయమైన చర్య- పాక్‌ ప్రధాని నవాజ్‌

ఖండించిన ప్రధాని మోదీ, ఐక్యరాజ్యసమితి

 

ఇస్లామాబాద్‌,డిసెంబర్‌16(జనంసాక్షి) : పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. సైన్యం దుస్తులు ధరించి పెషావర్‌ లోని సైనిక పాళశాలలోకి చొరబడిన తాలిబన్‌ ఉగ్రవాదులు విద్యార్ధులు,టీచర్స్‌, సహాయక సిబ్బందిని బందీలుగా చేసుకొన్నారు. అనంతరం క్షణాల్లోనే విచక్షణారహితంగా చిన్నారులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఉగ్రవాదుల పైశాచికానికి 141 మంది బలైనట్లు పాకిస్తాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. తరగతి గదుల్లో రక్తపుటేరులు పారించారు. మృతిచెందిన వారిలో 132 మంది చిన్నారులు, 9 మంది పాఠశాల సిబ్బందిఉన్నట్లు పాకిస్థాన్‌ ¬ంశాఖ ప్రకటించింది. పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌లో తాలిబన్లపై సైనిక దాడికి ప్రతీకారంగా పాఠశాలపై దాడులకు పాల్పడినట్లు తెహ్రీక్‌- ఈ- తాలిబన్‌ పాకిస్థాన్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. పాక్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ పాఠశాలపై ఉగ్రవాదుల దాడిని ఖండించారు.పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న సైనిక పాఠశాలను భద్రతా దళాలుచుట్టుముట్టాయి. 8 మంది తాలిబన్లు పాఠశాలలోకి ప్రవేశించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డరు. సైనిక పాఠశాలలో ఉగ్రవాదుల కిరాతకానికి బలైన చిన్నారులకు సంతాపసూచకంగా పాక్‌ ప్రభుత్వం మూడురోజుల సంతాప దినాలను ప్రకటించింది.పాకిస్థాన్‌లో తాలిబన్‌ ఉగ్రవాదుల దుశ్చర్యను భారత ప్రధాని నరేంద్ర మోదీ, ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఖండించారు. ఉగ్రవాదులు అమానవీయ, పాశవిక చర్యలకు ఒడిగట్టారన్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులపై మారణ¬మం సృష్టించడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పాకిస్థాన్‌లోని పెషావర్‌ చేరుకున్న ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ దగ్గరుండి సైనిక పాఠశాలలో జరుగుతున్న సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పెషావర్‌ పాఠశాలపై ఉగ్రదాడిని ఆయన జాతీయ విషాదంగా ప్రకటించారు. దుండగులు పాఠశాల లోపలికి రాగానే కాల్పులు జరపడం మొదలుపెట్టారని విద్యార్థులు చెప్లారు. మేం వెంటనే భయంతో తరగతి గదుల్లోకి వెళ్లిపోయాం. వారు ప్రతి క్లాస్‌ రూంలోకి వచ్చి విద్యార్థులను చంపడం మొదలుపెట్టారు’ అంటూ ఏడుస్తూ చెప్పారు. తాము తీవ్ర భయాందోళనలకు లోనైనట్లు వారు తెలిపారు.పెషావర్‌ పాఠశాలలో తాలిబన్ల దాడిని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌ తీవ్రంగా ఖండించారు. ‘నా మాతృభూమిలో భయంకరమైన దాడుల వార్తలను చూస్తున్నాను.. పెషావర్‌ ప్రజల కోసం ప్రార్థిస్తున్నా’నని అక్రమ్‌ ట్వీట్‌ చేశారు. ఘటనను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది.