పాక్ ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి
ఇమ్రాన్‌ఖాన్‌కు బలమైన గాయాలు
ఇస్లామాబాద్,మే 7 (జనంసాక్షి) : పాక్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. ఇస్లామాబాద్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాక్ మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు ఇమ్రాన్‌ఖాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా ఒక్క సారిగా వేదిక కూలడంతో కిందప డిపో యారు. 14 అడుగుల ఎత్తున్న వేదికపై నుంచి పడడంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. అంబులెన్స్‌లో హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన మద్దతు దారులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు
చేశారు. పలువురు ప్రముఖులు దగ్గరుండి ఆయనకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న ఆయన కుటుంబ సభ్యులను నాయకులు పరామర్శించారు.