పాక్‌ ఖైదీ సనావుల్లా మృతి

శవాన్ని పాక్‌కు పంపేందుకు భారత్‌ అంగీకారం
విచారణ జరపాలని పాకిస్థాన్‌ డిమాండ్‌
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌, మే 9 (జనంసాక్షి) :
తోటి ఖైదీ దాడిలో తీవ్రంగా గాయపడిన పాకిస్తాన్‌ ఖైదీ సనావుల్లా మృతి చెందాడు. చండీగఢ్‌లోని పీజీఐలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం చనిపోయాడు. ఖైదీ మృతదేహాన్ని ఆయన కుటుంబానికి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. మృతుడికి కుటుంబానికి క్షమాపణలు చెప్పిన కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే.. సనావుల్లా మృతదేహాన్ని పాక్‌కు అందిస్తామని తెలిపారు. మరోవైపు, తమ పౌరుడి మృతిపై పాక్‌ దిగ్భాంతి వ్యక్తం చేసింది. అతడిపై జరిగిన దాడిపై న్యాయ విచారణ జరిపించాలని భారత్‌కు విజ్ఞప్తి చేసింది.పాక్‌లోని సియోల్‌కోట్‌కు చెందిన సనావుల్లా 1999లో జరిగిన పేలుడు కేసులో టాడా చట్టం కింద జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. హైసెక్యూరిటీ ఉండే జమ్మూలోని కోట్‌ బల్వాల్‌లో ఉంటున్న ఆయనపై తోటి గత వారం దాడి చేశాడు. పాక్‌లో భారతీయ ఖైదీ సరబ్‌జిత్‌సింగ్‌ మృతి చెందిన తర్వాతి రోజే ఈ దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన సనావుల్లా పరిస్తితి విషమించడంతో గత శుక్రవారం చండీగఢ్‌లోని పీజీఐకి తరలించారు. అప్పట  నుంచి కోమాలోనే ఉన్న ఆయన గురువారం మృతి చెందారు. కీలక అవయవాలు పని చేయడం మానేశాయని, బ్రెయిన్‌ డెడ్‌ అయిన సనావుల్లా గురువారం ఉదయం మృతి చెందారని పీజీఐ వర్గాలు ప్రకటించాయి. మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలిపాయి. మేజిస్టేట్ర్‌ పర్యవేక్షణలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేస్తామని, ఆ ప్రక్రియ మొత్తం వీడియో తీయనున్నట్లు పేర్కొన్నాయి. కిడ్నీలు పూర్తిగా చెడిపోవడం, నాడీ వ్యవస్థ మందగించడంతో మంగళవారం నుంచి సనావుల్లా పరిస్థితి విషమిందని తెలిపాయి.ిమృతదేహాన్ని పాక్‌కు అప్పగిస్తాం: షిండే

సనావుల్లా మృతిపై భారత్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. చండీగఢ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సనావుల్లా మృతదేహాన్ని పాక్‌కు అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. పోస్టమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని పాక్‌కు అందజేస్తామని ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే పీటీఐ వార్తాసంస్థతో తెలిపారు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు విదేశాంగ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. అవసరమైన ప్రక్రియలన్నీ పూర్తయ్యాక మృతదేహాన్ని అప్పగిస్తామని చెప్పారు. చండీగఢ్‌లోనే పోస్టుమార్టం పూర్తి చేసి, అక్కడి నుంచే మృతదేహాన్ని పాక్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని పంపించాలని భారత్‌ పాక్‌ను కోరినట్లు పేర్కొన్నాయి.

ఇదిలా ఉంటే, సనావుల్లా మృతిపై న్యాయ విచారణ జరిపించాలని పాకస్తాన్‌ డిమాండ్‌ చేసింది. జైలులో సనావుల్లాపై పాశవిక దాడి జరగడం దురదృష్టకరమని ఆ దేశ విదేశాంగా శాఖ అధికార ప్రతినిధి ఐజాజ్‌ అహ్మద్‌ చౌదరి పేర్కొన్నారు. అతని మృతితో పాక్‌ ప్రభుత్వం తీవ్ర దిగ్భాంతికి గురైందని తెలిపారు. పాక్‌ నిరసనను భారత్‌కు తెలిపామని, ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరామని చెప్పారు. సనావుల్లా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. భారత జైళ్లలో ఉన్న పాక్‌ ఖైదీలకు పటిష్టమైన భద్రత కల్పించాలని ప్రధాని విూర్‌ హజర్‌ ఖాన్‌ ఖోసో భారత్‌ను కోరారని తెలిపారు. శిక్షాకాలం పూర్తయి ఇంకా భారత జైళ్లలో ఉన్న తమ దేశ పౌరులను విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు.
జగన్‌కు మళ్లీ భంగపాటు
అంగీకరించిన ధర్మాసనం… జూన్‌ 5 లోగా లొంగిపోవాలని ఆదేశించింది. నాలుగు నెలల్లోపు వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి, తుది చార్జిషీట్‌ దాఖలు చేయాలని సీబీఐకి సూచించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకొని త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. బెయిల్‌ ఇవ్వాలని జగన్‌, నిమ్మగడ్డ దాఖలు బెయిల్‌ పిటిషన్లు, విజయసాయి బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ దాఖలుచేసిన పిటిషన్లను ఇటీవల విచారించిన న్యాయస్థానం.. బుధవారం తీర్పు వెలువరించింది. బెయిల్‌ ఇవ్వాలని జగన్‌, నిమ్మగడ్డ చేసుకున్న విజ్ఞప్తిని జస్టిస్‌ సదాశివం, జస్టిస్‌ ఇక్బాల్‌లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. జగన్‌ది అతిపెద్ద ఆర్థిక నేరమని, ఆయన కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులు అక్రమేనన్న సీబీఐ వాదనలతో ఏకీభవించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గత మూడేళ్లలో ఆర్థిక నేరాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక నేరాలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పేర్కొంది. ఆర్థిక నేరాలను ఉపేక్షించ కూడదని వ్యాఖ్యానించింది.