పాఠశాలను సందర్శించిన దిశ కమిటీ జిల్లా సభ్యులు రాజేందర్

టేకులపల్లి, అక్టోబర్ 20( జనం సాక్షి ): టేకులపల్లి మండలం లోని సులానగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుని సంఘటనపై గురువారం దిశ కమిటీ జిల్లా సభ్యులు మాలోతు రాజేందర్ నాయక్ పాఠశాల సందర్శించారు. జరిగిన సంఘటనపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు ఆయనకు వివరిస్తూ ఇటీవల షీ టీం ఆధ్వర్యంలో సులానగర్ పాఠశాలలో అవగాహన కల్పించారని, ఆ సమయంలోనే విద్యార్థులు వారి అవగాహన మూలంగా పాఠశాలలో ఆ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్న తీరును తెలుపుతూ వివరించారని దిశా కమిటీ జిల్లా సభ్యులు రాజేందర్ తెలిపారు. ఆ తర్వాత ఉపాధ్యాయులను కూడా అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పాఠశాలలో అమలుపరుస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు.