పాఠశాల రూపురేఖలను మార్చిన క్యారియర్,నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థలు …

చిలప్ చేడ్/అక్టోబర్/జనంసాక్షి :- మండలంలోని ఫైజాబాద్ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి.క్యారియర్,నిర్మాణ్ స్వచ్చంద సంస్థలు ఆపాఠశాలను దత్తత తీసుకోవడంతో పాఠశాల సుందరంగా తీర్చిదిద్దారు.ఈ పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు 300మంది పిల్లలు చదువుతున్నారు చాలి చాలని,అరకొర సౌకర్యాలతో సతమయితమైన ఆ పాఠశాల ఉపాధ్యాయుల కృషితో దత్తత తీసుకున్న క్యారియర్,నిర్మాణ్ ఫౌండేషన్ ప్రతినిధులు బడికి కావాల్సిన అన్నీ మౌలిక వసతులను కల్పించి,గోడలపై విద్యార్థులను ఆకట్టుకొనేలా స్వాతంత్ర సమరయోధుల బొమ్మలను వేసి,కొటేషన్స్ తో ముస్తాబు చేశారు.
శుక్రవారం నాడు పాఠశాలను క్యారియర్,నిర్మాణ్ ఫౌండేషన్ బృందంతో ప్రారంభించి సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో నిర్మాణ్ సంస్థ సీఈఓ మయూర్ పట్నాల మాట్లాడుతూ విద్యార్థులు,ఒక్క చదువులోనే కాకుండా ఆటపాటల్లో బాగా రాణించాలని ఆయన కోరారు.దేశాన్ని అభివృద్ధిగా దిశగా మార్చడంలో విద్యార్థులు పాత్ర చాల ఉందని విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరి దేశ అభివృద్ధికి సహాయపడాలన్నారు.మాజీ ప్రధాని అబ్దుల్ కలం ఆశయాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నామని రాష్ట్రంలో ఉన్న 3వేల హైస్కూల్ లను,మరియు 9వేల ప్రైమరీ స్కూల్ లను సుందరంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం అని తెలిపారు.క్యారియర్ సంస్థ సీఈఓ ప్రకాష్ బోడ్ల మాట్లాడుతూ విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం మావంతు కృషి ఎతైన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.ఇప్పటి వరకు 6పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దాం.ఇంకా అన్ని పాఠశాలలో విద్యార్థులకు వసతులు కల్పించమే మాలక్ష్యం అని తెలిపారు..
ఆకట్టుకున్న విద్యార్థుల ఆటపాటలు..
పాఠశాల ప్రారంభోత్సవానికి వచ్చిన క్యారియర్,నిర్మాణ్ ఫౌండేషన్ ప్రజాప�

తాజావార్తలు