పాఠశాల రూపురేఖలను మార్చిన క్యారియర్,నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థలు .
చిలప్ చేడ్/అక్టోబర్/జనంసాక్షి :- మండలంలోని ఫైజాబాద్ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి.క్యారియర్,నిర్మాణ్ స్వచ్చంద సంస్థలు ఆపాఠశాలను దత్తత తీసుకోవడంతో పాఠశాల సుందరంగా తీర్చిదిద్దారు.ఈ పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు 300మంది పిల్లలు చదువుతున్నారు చాలి చాలని,అరకొర సౌకర్యాలతో సతమయితమైన ఆ పాఠశాల ఉపాధ్యాయుల కృషితో దత్తత తీసుకున్న క్యారియర్,నిర్మాణ్ ఫౌండేషన్ ప్రతినిధులు బడికి కావాల్సిన అన్నీ మౌలిక వసతులను కల్పించి,గోడలపై విద్యార్థులను ఆకట్టుకొనేలా స్వాతంత్ర సమరయోధుల బొమ్మలను వేసి,కొటేషన్స్ తో ముస్తాబు చేశారు.
శుక్రవారం నాడు పాఠశాలను క్యారియర్,నిర్మాణ్ ఫౌండేషన్ బృందంతో ప్రారంభించి సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో నిర్మాణ్ సంస్థ సీఈఓ మయూర్ పట్నాల మాట్లాడుతూ విద్యార్థులు,ఒక్క చదువులోనే కాకుండా ఆటపాటల్లో బాగా రాణించాలని ఆయన కోరారు.దేశాన్ని అభివృద్ధిగా దిశగా మార్చడంలో విద్యార్థులు పాత్ర చాల ఉందని విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరి దేశ అభివృద్ధికి సహాయపడాలన్నారు.మాజీ ప్రధాని అబ్దుల్ కలం ఆశయాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నామని రాష్ట్రంలో ఉన్న 3వేల హైస్కూల్ లను,మరియు 9వేల ప్రైమరీ స్కూల్ లను సుందరంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం అని తెలిపారు.క్యారియర్ సంస్థ సీఈఓ ప్రకాష్ బోడ్ల మాట్లాడుతూ విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం మావంతు కృషి ఎతైన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.ఇప్పటి వరకు 6పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దాం.ఇంకా అన్ని పాఠశాలలో విద్యార్థులకు వసతులు కల్పించమే మాలక్ష్యం అని తెలిపారు..
ఆకట్టుకున్న విద్యార్థుల ఆటపాటలు..
పాఠశాల ప్రారంభోత్సవానికి వచ్చిన క్యారియర్,నిర్మాణ్ ఫౌండేషన్ ప్రజాప్రతినిధులను విద్యార్థులు ఆటపాటలు,నృత్యాలు చాల బాగా ఆకట్టుకున్నాయి.విద్యార్థులతో కలిసి ఫౌండేషన్ సీఈఓలు బృందం కూడా ఆటపాలు చేయడంతో అందరిని ఆకర్షించాయి.పాఠశాల రూపురేఖలు మారడంతో తల్లిదండ్రుల సంతోషం
అరకొర వసతులతో ఇబ్బంది పడే తమ పిల్లలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని ప్రస్తుతం పిల్లలకు అన్ని వసతులు కల్పించిన క్యారియర్,నిర్మాణ్ సంస్థలకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామని ఇలాంటి పాఠశాలలో తమ పిల్లలు చదువుతునందుకు చాల సంతోషంగా ఉందన్నారు..
ఉపాధ్యాయుల మాటల్లో…
6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మధ్యమ విద్యను చదివే విద్యార్థులు 300 మందికి వరకు ఉన్నారు.ఇప్పుడు విద్యార్థులకు అన్నీ వసతులు క్యారియర్,నిర్మాణ్ సంస్థ వారు కల్పించడం చాల సంతోషం.ఇప్పుడు మావంతు కూడా మేము కష్టపడి పాఠశాలలో విద్యార్థులు సంఖ్య పెంచుతామని,సంస్థల పేరు కాపాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెరియర్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ మేనేజర్ శ్రీ ప్రకాష్ బొడ్ల,మేనేజింగ్ డైరెక్టర్,నవీన్ కుమార్,నిర్మాణ సంస్థశ్రీ మయూర్ పట్నాల,సీఈవో&పౌండర్ శ్రీమతి అనురాధా పుల్ల, ప్రోగ్రాం కో శ్రీకాంత్ కుమార్,సతీష్,సర్పంచ్ మనోహర,ఎంపీటీసీ మల్లమ్మ,సెక్రెటరీ నాగరాజు,స్కూల్ చైర్మన్ సురేఖకృష్ణ, వైస్ చైర్మన్ విట్టల్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు తారాసింగ్, ఉపాధ్యాయులు,పూర్వ ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు