*పాడి రైతుకు అండగా నిలిచిన ఎడ్మ కిష్టారెడ్డి మెమోరియల్ ఫౌండేషన్*
కల్వకుర్తి అక్టోబర్ 12 జనం సాక్షి:
పట్టణ పరిధిలో అబ్దుల్ ఖాదర్ రైస్ మిల్ ఏరియాలో గత కొన్ని రోజుల కింద పట్టణానికి చెందిన మైబెలి అనే పాడి రైతు పశువులను మేపుతున్న సమయంలో ప్రమాదవశాత్ కరెంట్ వైర్లు తగిలి మూడు గేదెలు మరణించడం జరుగింది. విషయం తెలుసుకున్న పుర ఛైర్మన్ ఎడ్మ సత్యం సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి రైతు మైబెలి ని పరామర్శించడం జరిగింది రైతు మైబెలి గేదెల పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తుండేవారు ఒక్కసారిగా 2 పాడి గేదలు చనిపోవడం ద్వారా వారి జీవనం కొనసాగడం ఇబ్బంది గా మారింది రైతుకు అండగా నిలిచిన ఎడ్మ కిష్టారెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ వారు రూ” 30 వేలు మరియు పాల ఉత్పత్తి దారుల సంఘం నుండి 30 వేలు మొత్తం 60వేల రూపాయలు బుధవారం ఉదయం పుర చైర్మన్ ఎడ్మ సత్యం మరియు పాల ఉత్పత్తి దారుల సంఘం సభ్యులు పాడి రైతు మైబెలి కి అందిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, మునిసిపల్ వైస్ ఛైర్మన్ షాహీద్, మాజీ చైర్మన్ రాచోటి శ్రీశైలం, పాల ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు డైరెక్టర్లు టేకులపల్లి లక్ష్మయ్య, మిర్యాల దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ ఆంజనేయులు, కుడుముల శేఖర్ రెడ్డి, ప్రహలాద్ రెడ్డి, బాలయ్య, పాండురంగ రెడ్డి, మాసుల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.