పాణ్రహిత-చేవెళ్ల సంగతేంది ?

ఇటీవలే ఢిల్లీలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, నిజంగా ప్రాజెక్టు ఇప్ప ట్లో సాధ్యమవుతుందా ? కాంగ్రెస్‌ నేతల మాటలు చూస్తుంటే ప్రాజె క్టు వచ్చినట్టు, మన గడపలోకి  నీళ్లు రావడమే ఇక ఆలస్యమన్నట్లు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇదంతా డ్రామానా, లేక తొందరలో అమలయ్యే ఛాన్సేమైనా ఉందా ? అన్న విషయాన్ని పరిశీలిస్తే..

ప్రభుత్వమే దశలవారీగా ప్రాజెక్టు 2019కి పూర్తవుతుందని చె ప్తోంది. అంటే మరో ఏడేళ్లన్న మాట ప్రాజెక్టు ప్రకటించిన తొలినాళ్ల లో ఇదే ప్రభుత్వం 2012 కి పూర్తిచేస్తామని పూర్తి పేజీ ప్రకటనలు అన్ని పేపర్లలో చేసింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్య మంత్రులు సంతకం చేయడంతో ఒక ప్రధాన ఘట్టం పూర్తియింది. మన ముఖ్యమంత్రి నుచి మొదలుకుని, కాంగ్రెస్‌ సాధారణ కార్యకర్త దాక ప్రాణహిత గురించి అవాకులు సెవాకులు మాట్లాడుతూ, ఇంకే ముంది, మా వల్లనే ప్రాజెక్టు వచ్చేసిందన్నట్లు వ్యవహరించడం బా ధగా ఉంది. జరుగుతున్నది వాస్తవానికి పూర్తిగా భిన్నంగా ఉన్నది.

‘ప్రాణహిత -చేవెళ్ల ‘ ప్రాజెక్టు ఒక మెగా ప్రాజెక్టు.160 టీఎం సీల ప్రాణహిత నీరు,20 టీఎంసీల గోదావరి నీరు వెరజి 180 టీ ఎంసీల నీరు ఉపయోగించుకుంటూ, 16 టీఎంసీలనీరు పారిశ్రామి క అవసరాలకు, 124 టీఎంసీల నీరు సాగునీరుకు వినియోగిస్తూ, 16 లక్షల 40 వేల ఎకరాల ఆనకట్టుకు నీరందించే బృహత్‌ పథకం ఈ ప్రాజెక్టు దీనికి ఇప్పుడున్న అంచనాల ప్రకారమే 40 వేల కోట్ల పై చిలుకు ఖర్చువుతుంది. (పూర్తయ్యే నాటికి ఎంతవుతుదో ఎవరూ చెప్పలేరు). దీంతో సాగయ్యే ఆనకట్టు ఆదిలాబాద్‌ జిల్లాలోని బెజ్జూరు, దహెగావ్‌, కౌటాలా, చెన్నూరు, జయపూర్‌, కోట్టిపల్లి, వెన్నెల వేమనపల్లి, దివాలర్‌పూర్‌, లక్ష్మణచందా, మామడ, సారంగా పూర్‌, నిర్మల్‌, ముథోల్‌, లోహెసా, లూనూరు, కుబేర్‌ బైంసా, కుం టాల (19) మండలాల్లోని 306 గ్రామాలకు చెందిన 1,56,500 ఎకరాలు. కరీంనగర్‌ జిల్లాలోని గంభీరావుపేట, ముస్తాబాద్‌, ఎల్లారె డ్డిపేట, సిరిసిల్లా, ఇల్లంతకుంట, బెజ్జంకి, కోనరావుపేట, వేములవా డ, కోహెడ,మెట్‌పల్లి (10) మండలాల్లోని 159 గ్రామాలకు చిందిన 1,71,449 ఎకరాలు సాగువుతుంది.

అలాగే మెదక్‌ జిల్లాలోని సిద్దిపేట,చినకొండూరు, నంగునూరు, దుబ్బాక, మీర్‌దొడ్డి, దౌల్తాబాద్‌, చేగుంట, గజ్వేల్‌, కొండపాక, జగ దేవ్‌పూర్‌, ములుగు, రామాయంపేట, వెల్దుర్తి, కౌడిపల్లి, హత్నూరు, కొండపూర్‌, సదాశివపేట, మనిపల్లి, రాయికోడ్‌, ఝరాసంగం, కో హిర్‌, న్కాల్కల్‌కు చెందిన 22 మండలాలోని 539 గ్రామాల్లోని 5,19,152 ఎకరాలు: నిజామాబాద్‌ జిల్లాలోని నిజామాబాద్‌, డిచ్‌ప ల్లి, దారేపల్లి, సిరికొండ, జక్రాస్‌పల్లి, ఆర్మూర్‌, మాక్లూర్‌, భీమగల్‌, వేల్యూలు, బాల్కొండ,కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌, తాడ్వాయి, గాంధారి, స దాశివనగర్‌, కామాడ్డి, భిక్నూరు, దోమకోండ, మాచాడ్డి (19) మం డలాల్లోని 275 గ్రామాలకు చెందిన 3,04,500 ఎకరాలు: నల్లగొం డ జిల్లాలోని చౌటుప్పల్‌, భువనగిరి, వలిగొండ, ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, ఎం.తుర్కపల్లి, ఆత్మకూర్‌(ఎం), రామన్నపేట, నార్క ట్‌పల్లి, చిట్యాల (11) మండల్లాలోని 171 గ్రామాలకు చిందిన 2,29,832 ఎకరాలు. రంగాడ్డి జిల్లాలోని వికారాబాద్‌, దారూర్‌, మారేపల్లి, మోమిన్‌పేట, బంట్వారం, పరిగి, దోమ, తాండూరు. పె ద్దెముల్‌, యాలాల, బషీరబాద్‌, చేవెళ్ల, శంకరపల్లి, నవాబుపేట, (14) మండలాలోని 283 గ్రామానికి చెందిన 2039 గ్రామాలకు చెందిన 11,863 ఎకరాలు, మొత్తం ఏడు జిల్లాలోని 97 మండలా లకు చెందిన 2039 గ్రామాల్లోని 16 లక్షల 40 వేల ఎకరాలు ఈ ప్రాజెక్టు ద్వారా సాగులోకి రాగలవన్నది అంచనా. అంటే తెలంగాణ అత్యంత లాభదాయకమైన వరప్రసాదిని వంటి ప్రాజెక్టు.మణిహరం అనదగ్గ ప్రాజెక్టు ఇది. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ప్రాజెక్టు అమలైతే తెలంగాణ రైతులు కృష్ణా, గోదావరి, జిల్లాలోని రైతాంగం లాగా రెండు, మూడు పంటలు తీసీ సంపన్నులవుతారని కాదు. కనీసం ఒక పంటకైనా నీరొస్తుందన్న ఆశ. రోజురోజుకీ అడు గంటిపోతున్న భూగర్భ జలాలు పైకొచ్చి రైతుల ఆత్మహత్యలు, వలస లు ఆగుతాయన్న నమ్మకం.

తెలంగాణ ఆదృష్టమేమంటే అద్భుతమైన వనరులున్నాయి. కృ ష్ణ, గోదావరి నదులు తెలంగాణ నుంచి ప్రవహిస్తున్నాయి. నల్ల బం గారం సింగరేణి ఉంది.అటవీ సంపద ఉంది. చక్కదనాల భూములు ఉన్నాయి. కష్టపడేందుకు రైతాంగం ఉంది. ఒకే ఒక సమస్య ఏమి టంటే భూములు పైస్థాయిలో ఉన్నాయి.

నదులు కింద స్థాయిలో ఉన్నాయి. గ్రావిటీ (వాలు) మార్గంగా పొలాలకు నీళ్లందించే అవకాశాలు దాదాపు శూన్యం. ఇప్పుడున్న శ్రీ రాంసాగర్‌, జూరాల, కడం, నాగార్జునసాగర్‌, నిజాంసాగర్‌ మరికొ న్ని ప్రాజెక్టులు మినహాయిస్తే రూపొందించిన ప్రాజెక్టులన్నీ ఎత్తిపోత లే. వాడుకోవాడానికి తెలంగాణకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అం దుకోవడానికి రెడీగా బీళ్లున్నాయి. కావలసింది, ఈ నీళ్లను ఎత్తి పోతల ద్వారా పొలాలకు అందించడం. మనకు ఇష్టమైనా కష్టమైనా తెలంగాణకు ఎత్తిపోతలు మినహా మరో మార్గం లేదు. తెలంగాణ భవిష్యత్తుపూర్తిగా ఎత్తిపోతల పథకాల సక్రమ నిర్వహణ పైనే ఆధారపడి ఉన్నది.

ఈ ప్రాజెక్టును ప్రభుత్వం (వైఎస్‌ఆర్‌ హయాంలో) ఆర్భాటంగా ప్రకటించి, హడావిడిగా 28 ప్యాకేజీలుగా విభజించి అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టింది. ఎవరెన్ని కబుర్లు చెప్పినా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసింది విశ్రాంత తెలంగాణ ఇంజనీర్ల బృందం. అందు లో  ప్రధాన పాత్రదారులు వెంకటరామారావు, అనంతరాములు నా తో సహా మారుతి, భీమయ్య, ప్రభాకర్‌, ఉమాకాంత్‌ ప్రభుత్వలు. ఈ ప్రాజెక్టు రూపకల్పన దశలో సారథ్యంవహించి తెలంగాణ ప్రాం త ప్రజాప్రతినిధుల సమావేశం  నిర్వహించి, ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లిన క్రెడిట్‌ ‘ది ఇనిస్టిట్యూ ఆఫ్‌ ఇంజి నీర్స్‌’ సంస్థది.

‘దేవుడు వరమిచ్చినా పూజరి వరమివ్వడు’ అన్నట్టుగా ఈ ప్రాజె క్టుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ పచ్చజెండా ఊపినా సీమాంధ్ర మంత్రులు, ఇంజనీర్లు అడుగడుగునా అడ్డంకులు  సృష్టించారు. ఈ ఆనకట్టును అయిదున్నర లక్షలకు కుదించడం నుంచి, ఈ ప్రాజెక్టు కు 160 టీఎంసీల నికిర జలాలు లేవని, ఈ ప్రాజెక్టు రిపోర్టు త యారు చేసే బాధ్యత తీసుకున్న ఔూూజూూ సంస్థ అధికారులను లొంగదీసుకుని ప్రాజెక్టుకు గండి కొట్టే ప్రయత్నాలు చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్టు తెలంగాణకు రావడం ఓర్వలేనితనంతోపాటు ఈ ప్రా జెక్టు అమలవుతే అమలులో ఉన్న ధవళేశ్వరం బ్యారేజీ (సర్‌ ఆర్థర్‌ ఆయకట్టు), కట్టబోయే పోలవరం నీరురాక సమస్యల పాలవుతాయే మోనన్న భయాందోళన వారిది. ఏదేమైనా ఈ సీమాంధ్ర గణం ఎ త్తుగడలను ఎప్పటికప్పుడు సమర్థంగా ఎదుర్కొంటూ, తిప్పికొడు తూ, తెలంగాణ ఇంజినీర్లు (రిటైర్డ్‌ వారి అండదండలతో) ఈ ప్రాజె క్టును ఈ ధశకు తీసుకురావడం ముదావహం.

ఇప్పటి పరిస్థితి ఏమిటంటే.. ప్యాకేజీలుగా ప్రభుత్వం తమ స్వా ర్థపూరిత ప్రయోజనాల కోసం హడావిడిగా పనులను కాంట్రాక్టర్లకు అప్పగించి ఇప్పటివరకు 1664 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంత భారీ ప్రాజెక్టును 40 వేల కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తిచేయడం ఈ ప్రభుత్వమే కాదు, మరే ప్రభుత్వానికీ సాధ్యం కాదు. అందుకోసమే దీనికి జాతీయ హోదా సాధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నా యి. జాతీయ హోదా అభిస్తే ప్రాజెక్టు కోసం ఇప్పటిదాకా ఖర్చ యిన మొత్తం మినహాయించి, మిగతా ఖర్చులో 90 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అది సాధ్యపడకపోతే ూIదీూ(సత్వర సాగునీటి లభ్ధి పథకం) కింద కరువు పీడిత ప్రాంతాలలో అనకట్టు ఉంటే 90 శాతం ప్రధానమంత్రి పథకం కింద గ్రాంటు వస్తుంది. కరువు పీడి త ప్రాంతం కాకపోతే 25 శాతం గ్రాంటు వస్తుంది. 16 లక్షల 40 వేల ఎకరాలలో కొంత ఆనకట్టు కరువుపీడీత ప్రాంతాలలో ఉంది. కాబట్టి దామాషా పద్ధతిన ూIదీూ కింద 57 శాతం నిధులు కేంద్రం నుంచి రాబట్టుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. లంటే వీలయితే 90 శాతం గ్రాంటు, లేకపొతే కనీసం 57 శాతం గ్రాంటు అయినా అఢిస్తె తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు కదలదన్న  మాట. అటు జాతీయహోదా అభించాలన్నా, ఇటు ూIదీూ కింద పీఎం ప్యాకేజీ లభ్ధి పొందాలన్నా లేక మామూలు ూIదీ ప్రయోజనం పొందాలన్నా ముందు కేంద్ర జలసంఘం అనుమతి, పర్యావరణ, అటవీ మంత్రి త్వశాఖ అనుమతి, గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతి, గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతి, అవసరమయితే ఆ తరువాత ప్రణాళిక సంఘం పెట్టుబడి అనుమతి అవసరం. ఇవేవీ లేకుండా పత్రికలలో, చానల్స్‌లో బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేయడం హోరం.

వాస్తవ పరిస్థితి ఏమంటే…సవివర క్షేత్ర అధ్యయన నివేదిక (ణూ=) తయారు చేసేందుకోసం అవసరమైన సూత్రప్రాయ అను మతిని కేంద్ర జలసంఘం ఇవ్వడం తప్ప ఇతరత్రా ఎలాంటి అ నుమతులు ఇంతవరకు ఈ ప్రాజెక్టుకు రాలేదు. పర్యావరణ అనుమ తులకు అవసరమైన ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం జరుగుతోంది. ఇంకా అటవీశాఖ అనుమతి కూడా రాలేదు. భూసేకరణ కార్యక్ర మాలు కొనపాగుతున్నాయి. అంటే మరోమాటలో చెప్పాలంటే ‘ ఆ లూ లేదు సూలు లేదు-అల్లుడిపేరు సోమలింగం’ అన్నట్టుగా ఉంది ఈ ప్రాజెక్టు వ్యవహారం. కాకపోతే దీనికి అత్యవసరమైన మహారాష్ట్ర అంగీకారం పొందడం ఒక ముందడుగు. పక్క రాష్ట్రాల అనుమతు లు రాక పోలవరం ఎంత అవస్థపడుతుందో అందరికీ తెలిసిన విష యమే. అన్ని అనుమతులు అభించాక చివరకు ప్రణాళికాసంఘం Iఅఙవర్‌ఎవఅ్‌ షశ్రీవaతీవఅషవ సాధించిన అంతిమంగా కేంద్ర ప్రభు త్వం ఆర్ధిక వ్యయంలో ఈ ప్రాజెక్టు బతికి బట్టకడుతుందనే అను కుందాం. సమస్యల్లా ఈ ప్రాజెక్టుకు అవసరమైన  3466 మెగావా ట్ల విద్యుత్తు (8701) మిలియన్ల యూనిట్లు). ప్రస్తుతం పథకం సాం క్షన్‌ కోసం జెన్‌కో ‘మేం సప్లై చేస్తాం’ అని హామీ పత్రం ఇచ్చినా ప్ర తి యేటా ఇంత పెద్దమొత్తం విద్యుత్తును ఉచితంగా ప్రభుత్వం రైతు ల నెత్తిన విద్యుత్తు ఖర్చు వేయని పద్ధతిని అలోచించకుండా ముం దుకు పోవడం శ్రేయస్కరం కాదు.

అందుకే రిటైర్డ్‌ ఇంజినీర్లు ప్రాణహితకు సవసఱషa్‌వస జూశీషవతీ ష్ట్రశీబరవ షaజ్‌ూఱఙవ జూశీషవతీ ర్‌a్‌ఱశీఅ (సొంత విద్యుత్‌ కేంద్ర) ఏర్పాటు చేసే ప్రతిపాదనకు జమా ఖర్చులతో సహా ప్రభుత్వానికి అందజేశా రు. కానీ దురదృష్టమేమంటే  ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పక్కన పెట్టింది. పాలకుల మనసులో ఏముందో అర్థం కావడం లేదు.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తెలంగాణ అత్యవసరం. ఏదైమైనా ప్రాణాలడ్డ పెట్టి అయినా సరే దీన్ని సాధించడం ప్రతి తెలంగాణ పౌ రుడి కర్తవ్యం. అయితే పరకాల ఎన్ని కలను దృష్టిలో పెట్టుకునో, ఈ ప్రాజెక్టును తెలంగాణకు తెస్తున్నాం కనుక పోలవరాన్ని అడ్డుకో కండి అని చెప్పడానికో ఈ పథకాన్ని తెరమీదకు తెస్తున్నామని సీ మాంధ్ర నాయకులు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరో టి లేదు. ప్రాణహిత మాకేమీ భీక్‌(బిచ్చం) కాదు. మానీళ్లు, మా పొ లాలకు ఈ వేళ కాకపోతే రేపు అయినా ఈ ప్రాజెక్టుతో తెచ్చుకుం టాం. మీరేదో దయాదాక్షిణ్యాలు చూపిస్తున్నట్టు నటిస్తే తెలంగాణ  ప్రజలు సహించరు. ఇల్లలకగానే పండుగ కాదు. పునాది రాయి వే యగానే అయిపోలేదు. ‘అభీదిల్లీ బహుత్‌ దూర్‌ హై’.

-ఎం.ఎం.ఆర్‌.