పాతపాటే ‘తెలంగాణ’ పరిశీలనలో ఉంది
కేబినెట్ పరిశీలనలో మతహింస బిల్లు
షెడ్యూల్ ప్రకారమే కర్ణాటక ఎన్నికలు : షిండే
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్రం మళ్లీ పాతపాటే పాడింది. ఈ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని, ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంటుందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పా రు. తెలంగాణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. తెలంగాణ ఎంపీలు పార్టీ వీడి వెళతారన్న సమా చారమేదీ తనవద్ద లేదని అన్నారు. బెంగ ళూరులో జరిగిన పేలుడుకు సంబంధించి ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. బుధవారం బెంగళూరులోని బిజెపి ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన బాంబు దాడికి మిగతా 2లోసంబంధించి దర్యాప్తులో ఇంకా ఎలాంటి పురోగతి కనిపించలేదని అన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని అన్నారు. పేలుడుకు ఉపయోగించిన మోటర్ బైక్ యజమానిని తమిళనాడు పోలీసుల సహాయంతో గుర్తించారని ఆయన చెప్పారు. అయితే ఆ వాహనం నాలుగేళ్ళ క్రిందటే అమ్మేసామని శంకర్‌నారాయణన్ అనే టెలికాం శాఖ విశ్రాంత ఉద్యోగి తెలిపారు. తన కుమారుడి కోసం ఆ బైక్‌నుకొనాన్నమని, అతను విదేశాలకు వెళ్ళిన తరువాత దానిని అమ్మేసామని ఆయన తెలిపారు. కాగా, బెంగళూరు పేలుడు నిందితులను తప్పనిసరిగా పట్టుకుని శిక్షిస్తామని ఆయన జాతికి హామీ ఇచ్చారు. పేలుళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం రాష్ట్రాలకు అందిస్తునే ఉన్నామన్నారు. మెట్రోనగరాలలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని బెంగళూరు పేలుళ్లకు ముందు కూడా అన్ని మెట్రో నగరాలకు హెచ్చరించామన్నారు. హైదరాబాద్ పేలుళ్ళు జరిగిన తరువాత ఎప్పటికప్పుడు తమకు అందిన సమాచారాన్ని రాష్ట్రాలకు పంపుతున్నామన్నారు. అయితే దేవాలయాలు, మసీదులు, చర్చిలకు సంబంధించి ప్రత్యేకంగా హెచ్చరికలు పంపలేదన్నారు. వీటిపై దాడులు జరగొచ్చన్న ఖచ్చితమైన సమాచారమేదైనా తమకు అందితే దానిని రాష్ట్రాలకు ప్రత్యేకంగా హెచ్చరికలు చేస్తామన్నారు. బెంగళూరులో జరిగిన పేలుళ్ల ప్రభావం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ఉండబోదన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఉగ్రవాద దాడులు ఇంకా ఎక్కడెక్కడ జరుగుతాయో తమకెలాంటి సమాచారం లేదన్నారు. రాజకీయ నాయకులు ఎవరికైనా ఉగ్రవాద ముప్పు ఉందంటే వారికి తగిన భద్రత కల్పిస్తామని చెప్పారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర మంత్రి అమిత్ మిశ్రాపై జరిగిన దాడికి సంబంధించి విచారణకు ఆదేశించామని చెప్పారు. ఖలిస్థాన్ తీవ్రవాది భుల్లార్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలన్న పంజాబ్ ముఖ్యమంత్రి బాదల్ వినతి పత్రం తమకు అందిందన్నారు. ప్రధాని, రాష్ట్రపతికి కూడా దీని ప్రతులు అందాయని, ఈ అంశం పరిశీలనలో ఉందన్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌కు వ్యతిరేకంగా తనకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. హైదరాబాద్ పేలుళ్లకు బాధ్యులెవరో తాను చెప్పలేనని అన్నారు. మరణశిక్ష అమలు చేసినప్పుడు ఆ సమాచారాన్ని బాధిత కుటుంబాలకు అందించాల్సి ఉందని, అయితే అది రహస్యంగా ఉంచాలని హోంమంత్రి చెప్పారు. మతహింస బిల్లు కేబినెట్ పరిశీలనలో ఉందని షిండే తెలిపారు. మీడియా అడిగిన ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం చెప్పలేనంటూ వ్యాఖ్యానించారు.