పాపికొండల్లో రాత్రి బస నిలిపివేత
ఖమ్మం, అక్టోబర్ 26 : జిల్లాల్లోని జిఆర్‌పురం మండలంలో గల పాపికొండల్లో రాత్రిపూట బసను మరొ నాలుగు రోజుల వరకు నిలిపివేస్తున్నట్టు భద్రాచలం సబ్ కలెక్టర్ భరత్ గుప్తా ఆదేశించారు. పాపికొండల్లో రాత్రి బస చేసిన ఇద్దరు పర్యాటకులు మృతి చెందిన విషయంపై ఆయన కుంచవరం గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లూరులోని ప్రైవేటు వ్యాపారులు సాగిస్తున్న వెదురు కుటీరాల్లో ఏర్పాటు చేసిన సభను రెవెన్యూ అధికారులు పరిశీలించిన తరువాత నడుపాలని జిఆర్‌పురం తహశీల్దార్ కిరణ్‌కుమార్‌ను ఆదేశించారు.