పారిశుద్ధ్య పనుల కోసం తానే డ్రైవర్ గా మారిన పంచాయతీ కార్యదర్శి.

దుబ్బాక 07,ఆగష్టు ( జనం సాక్షి )
అంకితభావంతో పనిచేసే ఉద్యోగులు కొంతమంది మాత్రమే ఉంటారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేయడంతో పాటు అందరి మన్నాళ్లు పొందడం అంత సులభమైన పని కాదు. ఉద్యోగం భారంగా కాకుండా ఇష్టంగా చేస్తే సత్ఫలితాలు లభిస్తాయి అంటున్నారు. పంచాయతీ కార్యదర్శి వజ్రమ్మ.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం వెంకటగిరి తండాలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న వజ్రమ్మ గ్రామస్తుల మన్ననలు పొందుతుంది. గ్రామంలో చెత్త సేకరణతో పాటు గ్రామంలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించేందుకు గడ్డి మందులు పిచికారి చేయడానికి ట్రాక్టర్ అవసరం ఏర్పడింది. గ్రామ పంచాయతీ పరిధిలో ట్రాక్టర్ ఉన్నప్పటికీ డ్రైవర్ రాకపోవడంతో పనిని పక్కన పెట్టేసి వెళ్ళిపోలేదు. అలా అని మరొక రోజుకు పనిని వాయిదా వేయకుండా వెంటనే తానే డ్రైవర్ గా మారి గ్రామంలోని అన్ని వీధుల్లో గడ్డి మందును పిచికారి చేసి శభాష్ అనిపించుకుంది. మహిళ ఉద్యోగిని అయి ఉండి ట్రాక్టర్ డ్రైవర్ గా మరి ప్రజలకు సేవలు అందించడం పట్ల గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి వజ్రమ్మను అభినందిస్తున్నారు. గ్రామ విధుల పట్ల వజ్రమ్మ అంకిత భావాన్ని చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.