పార్టీ కోసం పని చేసేటోళ్లను గౌరవించేది బీఆర్‌ఎస్‌ పార్టీనే..! – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

జనంసాక్షి మంథని : 40ఏండ్ల ఒకే కుటుంబపాలన కష్టాల నుంచి విముక్తి పొందాల్సిన అవసరం ఉందని బీఆర్‌ఎస్‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్టమధూకర్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముత్తారం మండలం పారుపల్లి, మంథని పట్టణం, మంథని మండలం అడవి సోమన్‌పల్లి గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు యువకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మనం ఓట్లు వేసి అధికారం అప్పగిస్తే కనీసం మన ఆకలి తీర్చాలనే ఆలోచన చేయలేదని, అలాంటి వాళ్లు మళ్లీ ఓట్ల కోసం ఊర్లల్లకు వస్తున్నారని ఆయన అన్నారు. ఏండ్లకు ఏండ్లు పార్టీ జెండా మోసి పాలకులను భుజాలపై ఎత్తుకున్నా మన కష్టాలను గుర్తించకపోగా కనీసం ఆపదలో ఉన్నప్పుడు పైసా సాయం చేయలేదని ఆయన వివరించారు. అలాంటి వారి పాలనకు స్వస్తి పలుకాల్సిన సమయం వచ్చిందని, ప్రతి ఒక్కరు ఆలోచన చేసి చైతన్యం దిశగా అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను గౌరవించే ఏకైక పార్టీ బీఆర్‌ఎస్‌ పార్టీ అని, ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే అన్ని వర్గాలకు సంక్షేమఫలాలు అందించడం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని, కష్టపడే కార్యకర్తకు బీఆర్‌ఎస్‌ పార్టీలో మంచి భవిష్యత్‌ ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముత్తారం మండలం పారుపల్లి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తగారపు లింగయ్య.ఇనుముల సాగర్. ఇనుముల మహేందర్. ఇనుముల కర్ణాకర్. సంగే రామకృష్ణ.సంగే పోసాలు. తగారపు వేణు ప్రసాద్. ఇనుముల స్వామి ఇనుముల శివతో పాటు అడవిసోమన్‌పల్లి గ్రామానికి చెందిన సెగ్గెం సంతోష్‌, స్వర్ణపల్లి గ్రామానికి చెందిన బండారి తిరుపతి, మంథనికి చెందిన పీక మల్లయ్య, రామకృష్ణాపూర్‌కు చెందిన తూండ్ల రాజు, ఖానాపూర్‌కు చెందిన మంథని శంకర్‌, అక్కెపల్లికి చెందిన పొయిల తిరుపతిలతో పాటు పలువురు జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.