పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం బలపడాలి: సోనియాగాంధీ

హర్యానా:పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం మరింత బలపడాలని, బాధ్యతలు స్వీకరించేందుకు యువత ముందుకు రావాలని సోనియా గాంధీ సూచించారు. సూరజ్‌కుండ్‌ కాంగ్రెస్‌ మేధోమథన సదస్సు ఆమె ఈ సూచనలు చేశారు. సబ్సిడీ సిలిండర్ల సంఖ్య 6నుంచి 12కు పెంచాలని దిగ్విజయ్‌సింగ్‌ పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తామని, ధరల పెరుగుదల నియంత్రణకు ప్రయత్నిస్తామని మేధోమథనంలో సోనియా చెప్పారని ద్వివేది పేర్కొన్నారు. దేశ ఆర్థిక పురోగతికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ శ్రేణుల మనోభావాలను మంత్రులు తెలుసుకోవాలని సోనియా సూచించారన్నారు. రాష్ట్రాల పర్యటనలకు వెళ్లినప్పుడు పార్టీ కార్యాలయాలకు మంత్రులు వెళ్లాలని ద్వివేది సూచించారు.