పార్లమెంటులో విపక్షాల తీరు గర్హనీయం
హుందా కోల్పోయి ఇష్టానుసారం వ్యవహరించారు
సభను సజావుగా సాగకుండా వ్యూహంతో అడ్డుకున్నారు
దేశానికి వీరంతా క్షమాపణలు చెప్పుకోవాల్సిందే
రాజ్యసభలో వ్యవహారాలపై చర్య తీసుకోవాలని ఛైర్మన్‌కు వినతి
విూడియా సమావేశంలో అనురాగ్ ఠాకూర్ తదితరలు మండిపాటు
న్యూఢల్లీి,అగస్టు12(జనం సాక్షి): పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు వ్యవహరించిన తీరును కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిరచింది. పార్లమెంట్‌ను సజావుగా సాగనీయకుండా ఆటంకం సృష్టించడం, బెదిరింపు ధోరణులతో వ్యవహరించినందుకు ప్రతిపక్షం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని
కేంద్రమంత్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏడుగురు కేంద్రమంత్రులు సంయుక్త విూడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్‌లోకి బయటి వ్యక్తులను తీసుకొచ్చి దాడిచేయించారన్న విపక్ష నేతల ఆరోపణలను కొట్టిపారేశారు. ప్రతిపక్షాలు నాటకాలాడుతున్నాయని, పార్లమెంట్‌లోకి బయటివారెవరినీ అనుమతించలేదని కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్ తదితరులు స్పష్టంచేశారు. బుధవారం పార్లమెంట్ లోకి బయటి వ్యక్తులు వచ్చి మహిళా ఎంపీలపై దాడికి పాల్పడ్డారంటూ ప్రతిపక్షనేతలు చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కొట్టి పారేశారు. బయటి వ్యక్తులు ఎవరూ పార్లమెంట్‌లో అడుగుపెట్టలేదని, ప్రతిపక్షాలు కావాలనే డ్రామాలు ఆడుతున్నాయని ఆయన ఘాటుగా స్పందించారు. పార్లమెంట్‌లో జరిగిన రభసపై వివరణ ఇచ్చారు. సభలో ప్రతిపక్షాల తీరు సమావేశాలకు భంగం కలిగించే విధంగా ఉంది. చైర్మన్ గౌరవానికి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించారు. ఇంత చేసింది కాక మహిళా ఎంపీలపై బయటి వ్యక్తులెవరో దాడి చేశారని ఆరోపిస్తున్నారు. 12 మంది మహిళా మార్షల్స్, 18 మంది పురుష మార్షల్స్ మాత్రమే సభలో ఉన్నారు. బయటి వ్యక్తులెవరికీ పార్లమెట్‌లోకి అనుమతి ఉండదు. బయటి వ్యక్తులెవరూ పార్లమెంట్‌లోకి రాలేదు. నిజానికి ఇద్దరు మహిళా మార్షల్స్‌పై కాంగ్రెస్ ఎంపీలే దాడికి పాల్పడ్డారు. మార్షల్స్ మెడలు పట్టుకుని తోశారు. నిజానికి ఇది సిగ్గుపడాల్సిన ఘటన అని అనురాగ్ ఠాకూర్ అన్నారు. కాగా, మహిళా ఎంపీలపై సుమారు 40 మంది దాడికి పాల్పడ్డారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే బుధవారం ఆరోపించారు. మహిళా ఎంపీలపై దాడి చేసిన వారు బయటి వ్యక్తులని, సభలోకి వచ్చి దాడికి పాల్పడ్డారని వారు పేర్కొన్నారు. మంగళవారం రోజున కొందరు విపక్ష ఎంపీలు రాజ్యసభలో టేబుల్‌పైకి ఎక్కి ఏదో గొప్పపని చేసినట్టు ఫీలయ్యారని, ఆ వీడియోలను ట్విటర్‌లో కూడా పోస్ట్ చేశారని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. పార్లమెంట్ సజావుగా సాగనీయకూడదని ముందస్తుగానే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు నిర్ణయించుకున్నాయని ఆరోపించారు. నిబంధనలను ఉల్లంఘించిన ప్రతిపక్ష ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మన్‌ను డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ తరహా ప్రవర్తన పార్లమెంటీరియన్లకు సమంజసం కాదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. సభలో ఫర్నీచర్, తలుపులు విరగ్గొట్టడం, ప్రకటన చేస్తున్న మంత్రుల నుంచి పేపర్లు లాక్కొని చింపేయడం, మార్షల్స్‌పై చేయిచేసుకోవడం వంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదన్నారు. ఇది యావత్ దేశానికే సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. మంగళవారం రాజ్యసభలో ప్రతిపక్షాల ప్రవర్తన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మరింత దిగజార్చేలా ఉందన్నారు. దేశ ప్రజలు తిరస్కరించడంతో ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరుకు దేశ ప్రజలకు ప్రతిపక్షాలు క్షమాపణలు చెప్పాల్సిందేనని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. వీధుల నుంచి పార్లమెంట్ దాకా అరాచకం సృష్టించడమే విపక్షాలు అజెండాగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. రాజ్యసభలో సెక్రటరీ జనరల్ టేబుల్ నృత్యాలు చేయడానికో, నిరసనల కోసమో కాదని మండిపడ్డారు. తమ సమస్యల్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతారని ప్రజలు ఎదురు చూస్తున్నారని, కానీ అవేవిూ
విపక్షానికి పట్టడంలేదని దుయ్యబట్టారు. మొసలి కన్నీరు కార్చడానికి బదులుగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.