పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్ట బద్ధత కల్పించాలి

స్టేషన్ ఘనపూర్, జూలై 21 , ( జనం సాక్షి) :
పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్ట బద్ధత కల్పించాలని ఎంఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి సండేనా రవీందర్ మాదిగ,ఎంఎస్పీ మండల ఇంచార్జీ చాడ ఏలియా అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కు చట్టబద్ధత కల్పించాలని విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న క్రమంలో జులై మూడో తారీఖున ప్రధానమంత్రి సభలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై దాడిని నిరసిస్తూ ఎమ్ఎస్పీ ఆధ్వర్యంలో డివి జన్ కేంద్రంలో దీక్షలు ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 27 సంవత్సరా లుగా  సుదీర్ఘ పోరాటం ఆవేదన ఆవేశంగా మారి తీవ్రరూపం దాల్చకముందు మాదిగల న్యాయమై న డిమాండ్లను ఈ వర్షాకాల పార్లమెంటు సమావే శాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని లక్ష్యంతో దీక్షలుప్రారంభించడంజరిగిందిఅన్నారు. ఈకార్యక్రమంలో ఎంఎస్పి మండల ఇన్చార్జి చాడ ఏలియా మాదిగ,కోఇంచార్జ్ గోవింద్ ఇసాక్ మాది గ, జిల్లా దళిత నాయకులు రాములు, మండల కార్యదర్శి గాదె శ్రీధర్ ,మండల ఉపాధ్యక్షుడు గుర్రం అశోక్ , మండల నాయకుడు గుర్రం నవీన్,  కుమార్ ,సంఘీభావంగా కాంగ్రెస్ నాయకులు చింత ఎల్లయ్య ,కాంగ్రెస్ యువత మండల అధ్య క్షుడు ఐలాపాక శ్రీను, కొత్తపల్లి గ్రామ శాఖ అధ్య క్షుడుగోవిందురాజయ్య,తదితరులుపాల్గొన్నారు.