-->

.పిన్నపురం జలవిద్యుత్‌ ప్రాజెక్టు పనులు ఆపండి

` కృష్ణాబోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం మరో సారి లేఖ
హైదరాబాద్‌,సెప్టెంబరు 28(జనంసాక్షి):కృష్ణాబోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం మరో సారి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న పిన్నపురం జలవిద్యుత్‌ ప్రాజెక్టు పనులు ఆపాలని విజ్ఞప్తి చేసింది. కొత్త, ప్రస్తుత ప్రాజెక్టుల విస్తరణ ఆపాలని కోరింది. బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా చేపట్టవద్దని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. లేఖలోని అంశాలను జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.