పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు

దేవరుప్పుల, జులై 08 (జనం సాక్షి) :* దేవరుప్పుల మండల పరిధిలోని ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా పలు బట్టలషాపులు,పలు దుకాణాలు,హోటళ్లు, దాబాలు, ఇటుక బట్టీలను బాలల పరిరక్షణ విభాగం అధికారి ప్రకాష్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రకాష్  మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని దీని ద్వారా తప్పిపోయిన బాలబాలికలు బాల కార్మికులు అనాథ పిల్లలను గుర్తించి వారిని తల్లిదండ్రుల వద్దకు అనాథలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతుందని వీధి బాలలకు విముక్తి కల్పించే ప్రయత్నం చేస్తున్నామని ఐసిడిఎస్ ఎన్జీఓలు వివిధ శాఖల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని
18 సంవత్సరాల లోపు బాలలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది రాజు, షఫీ, రాజశేఖర్, పద్మ, తదితరులు పాల్గొన్నారు.