పిల్లల పెరుగుదల, పర్యవేక్షణ పై అవగాహన
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 7 (జనం సాక్షి);
పిల్లలు పుట్టిన మొదటి సంవత్సరంలో అత్యధిక పెరుగుదల ఉంటుందని బరువులలో సరి అయిన పెరుగుదల పర్యవేక్షణ పై అంగన్వాడీ టీచర్ ఎస్.ఫరిదా బేగం అవగాహన కల్పించారు.
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల పరిధిలోని తిమ్మాజి పల్లె గ్రామంలో బుధవారము పిల్లల పెరుగుదల పర్యవేక్షణ అనే అంశంపై అంగన్వాడీ టీచర్ ఫరీదా బేగం మాట్లాడుతూ బరువులో సరియైన పెరుగుదల ఉన్న బిడ్డను ఆరోగ్యమైన బిడ్డ ఖచ్చితమైన వయసు తెలుసుకొనుటకు బరువును నిర్ధారించుటకు గ్రోత్ చార్ట్ పై బరువును గుర్తించుట పెరుగుదల రేఖ ను వివరించి బిడ్డ పెరుగుదల గురించి తల్లితో చర్చించుట సలహా సూచనలు బిడ్డల తల్లులకు వివరించినట్లు, 0 నుండి 5 సంవత్సరంలోపు బిడ్డలు పెరుగుదల సక్రమంగా జరిగేలా చూడడమే పెరుగుదల పర్యవేక్షణ అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త ఈశ్వరమ్మ ఆయా కే. మహేశ్వరమ్మ,గర్భవతులు, బాలింతలు,పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.