పిల్లల సంపూర్ణ ఆరోగ్యం కోసమే మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ కు శ్రీకారం చుట్టాo
కలెక్టర్ అనురాగ్ జయంతి
– సిరిసిల్ల లోని రాజీవ్ నగర్ అంగన్వాడి కేంద్రంలో ప్రారంభించిన జిల్లా కలెక్టర్
రాజన్నసిరిసిల్లబ్యూరో. సెప్టెంబర్ 10. (జనం సాక్షి). పిల్లల సంపూర్ణ ఆరోగ్యం కోసం జిల్లాలో ఒక్క పిల్లోడు పోషణలోపంతో ఉండోద్దన్న ఉద్దేశ్యంతోనే ప్రతి పిల్లాడికి పౌష్టిక ఆహారం అందించేందుకు మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ కు శ్రీకారం చుట్టామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
సిరిసిల్ల పట్టణం రాజీవ్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో అంగన్వాడి కేంద్రంలో పండుగ వాతావరణంలో చిరు ధాన్యాల పోషకాహార పండుగ కార్యక్రమం ప్రారంభం అయ్యింది.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సివియర్, మోడరేట్ పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల వివరాలను విడుదల చేసింది. జిల్లాలో 700 మంది పిల్లలు తీవ్ర పోషకాహార రూపంతో మరో 200 మంది పిల్లలు అతి తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తెలిపింది.
దాన్ని బెంచ్ మార్క్ గా తీసుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక్క పిల్లోడు పోషణలోపంతో ఉండోద్దన్న ఉద్దేశ్యంతోనే మంత్రి కేటీఆర్ సూచన మేరకు మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు.
ఇప్పటికే అంగన్వాడి కేంద్రాల ద్వారా జీరో నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు పోషకాహారం అందిస్తుండగా దానిని మరింత మెరుగుపరిచి చిరుధాన్యాలతో కూడిన రాగి లడ్డూలు ఇతర ఆహార పదార్థాలను పిల్లలకు అందించి వారి ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచాలన్న ఉద్దేశంతో జిల్లాలోని 587 అంగన్వాడి కేంద్రాల పరిధిలోని నమోదైన 36 వేల మంది పిల్లలకు పైగా లబ్ధి చేకూర్చేందుకు మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ అనే కార్యక్రమం అమలు చేస్తున్నాం. ప్రతి శనివారం ఒక్కో పిల్ల వాడికి రాగి పిండి, నెయ్యి, బెల్లంతో కూడిన ఒక్కో లడ్డు లను అందజేస్తామని తెలిపారు. బాలింతలు, గర్భిణులకు కూడ పోషకాహారం అందిస్తామని అన్నారు.
ప్రతి నెల రెండవ శనివారం నిర్వహించే ఈ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ద్వారా చిరు ధాన్యాల ప్రాధాన్యత పై ప్రజలకు అవగాహన , చైతన్యం కలుగుతుందన్నారు.ఈ కార్యక్రమం చేపట్టి ఒక ఉద్యమ రూపంలో అన్ని మున్సిపాలిటీ వార్డులు గ్రామపంచాయతీలోని అంగన్వాడీ కేంద్రాలలో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమం ఒక ఉద్యమ స్ఫూర్తితో చేపట్టేందుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీ ల చైర్ పర్సన్ లు, వార్డు సభ్యులు గ్రామపంచాయతీ సర్పంచులు వార్డు సభ్యులు, ఎంపీటీసీ లు, జెడ్పీటీసీ లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం ఉంటే నే కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్ పర్సన్ లు పిల్లలకు లడ్డూలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మి రాజం,
కమీషనర్ సమ్మయ్య, మెప్మా రిసోర్స్ పర్సన్ లు, ఆశా లు, స్థానికప్రజాప్రతినిధులు ,అధికారులు పాల్గొన్నారు.