పీర్ల గుట్టపై సరైన సౌకర్యాలు కల్పించాలని వినతి

వనపర్తి జులై 14 (జనం సాక్షి) వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టపై సరైన సౌకర్యాలు కల్పించాలని ముస్లిం మత పెద్దలు మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈనెల 31వ తేదీ నుండి పీర్ల పండుగ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి కావున పీర్లగుట్టపై భక్తులకు అవసరమైన సౌకర్యాలు మంచినీరు,కరెంటు,వీధి దీపాలు,గుట్ట పైకి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం సరిగా లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా వనపర్తి జిల్లా కేంద్రంలో వివిధ ప్రాంతాలు బ్రాహ్మణ వీధి,పోచమ్మ గుడి వీధి,మౌలానా వీధి,ఉర్దూ మీడియం స్కూల్ వీధి,రాజనగరం,నాగవరం పలు ప్రాంతాలలో పీర్ల పండుగ ఉత్సవాలు జరుగుతాయి కావున ఈ ప్రాంతాలలో సరియైన సౌకర్యాలను కల్పించవలసిందిగా మున్సిపల్ చైర్మన్ ను కోరారు. ఈ విషయమై మున్సిపల్ చైర్మన్ ఆ ప్రాంతాలలో తగు సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు షేక్ జహంగీర్,మజీద్ కమిటీ అధ్యక్షులు మైసన్,టిఆర్ఎస్ మాజీ మైనార్టీ అధ్యక్షులు అజిజ్ ఖాన్,అక్తర్,లతీఫ్,షేక్ హైదర్ అలీ,మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area