పీసీసీ మెంబర్ పైడిపల్లి కిషోర్ కుమార్ కి ఘన సన్మానం
పాల్గొన్న బోనకల్ గ్రామ శాఖ నాయకులు
బోనకల్ అక్టోబర్ 02,జనం సాక్షి:
మధిర నియోజకవర్గం నుంచీ పిసిసి మెంబర్ గా ఎన్నికైన మాజీ డీసీసీ కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్ నీ బోనకల్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ కిషోర్ కుమార్ పీసీసీ మెంబర్గా ఎన్నికవ్వటం హార్షనియమని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న కిషోర్ కుమార్ లాంటి వ్యక్తి మరిన్ని పదవులు అధర్వహించాలని వారు కోరారు.పైడిపల్లి కిషోర్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకి పదవి అప్పగించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని,జిల్లాలో పార్టీ నీ మరింత పటిష్టవంత పరిచేందుకు సాయ శక్తుల కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు హామీ ఇచ్చారు.రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రానున్నదని అందుకు అనుగుణంగా ప్రతి ఒక్క కార్యకర్త అంకితభావతం పనిచేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలో వచ్చే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు,కలకోట సొసైటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు,గ్రామ శాఖ అధ్యక్షుడు మరీదు శ్రీనివాసరావు,మండల ఎస్సీ సెల్ నాయకులు మారుపల్లి ప్రేమ్ కుమార్,గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు వరికోటి వెంకటి, వైస్ ఎంపీపీ గూగులోత్ రమేష్,గాంధీపథం నాయకులు పాసంగుల కోటేశ్వరరావు, వార్డు మెంబర్ కనగల నాని, షేక్ గఫూర్,గ్రామ కాంగ్రెస్ నాయకులూ యార్లగడ్డ శ్రీను, టాగూర్,బాలకృష్ణ, చారి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.