పునరావాస కేంద్రాన్ని సందర్శించిన గండ్ర….

*అధైర్యపడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది….
***భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి……
.జూలై..(జనంసాక్షి) గత వారం రోజులుగా కురుస్తున్న  అతి భారీ వర్షాలకు ఇళ్లు కోల్పోయిన బాధితులు ఎవరు అధైర్య పడవద్దని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడం కోసం కృతనిశ్చయంతో ఉందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి బాధితులకు భరోసా ఇచ్చారు. గురువారం టేకుమట్ల మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లు కూలిన బాధితులు రైతు వేదికలో పునరావాసం కల్పించడం జరిగిందని స్థానిక సర్పంచ్ సర్పంచ్ మిట్టపల్లి వనమ్మ చంద్రయ్య, వెల్లంపల్లి  ఎంపీటీసీ సభ్యులు సంగి రవి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కి సమాచారం అందించగా వెల్లంపల్లి గ్రామంలోని రైతు వేదిక లో ఉన్న బాధితులను ఎమ్మెల్యే పలకరించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ  గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లు కోల్పోయిన బాధితులందరికీ ఇల్లు మంజూరు చేస్తానని, బాధితులు ఎవరు అధైర్య పడొద్దని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. భారీ వర్షాలు కురవడం వల్ల చెరువులు, కుంటలు,వాగులు నిండుకుండలా మారాయని, పొంగిపొర్లుతున్న వాగులు రైతులు ఎవరు దాటడానికి సాహసం చేయరాదని, కొద్దిరోజుల వరకు మత్స్యకారులు ఎవరుచేపల వేటకు వెళ్లరాదని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల  విద్యుత్ స్తంభాలు తడిసి విద్యుత్ షాక్ కు గురి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని శాసనసభ్యులు  గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, మొగుళ్లపల్లి జెడ్ పి టి సి  జోరిక సమ్మయ్య,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సట్ల రవి గౌడ్,స్థానిక సర్పంచ్ మిట్టపల్లి వనమ్మ చంద్రయ్య, వెల్లంపల్లి ఎంపీటీసీ సభ్యులు సంగి రవి,వెల్లంపల్లి మాజీ సర్పంచ్ ఓరుగంటి సధాకర్ గౌడ్,ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.