పునరావాస కేంద్రాన్ని సందర్చించిన జడ్పీటీసీ శ్రీలత.

బూర్గంపహాడ్ జూలై  (జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల
పరిధిలోని మొరంపల్లి బంజర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోదావరి ముంపునకు గురైన లోతట్టు ప్రాంత ప్రజల పునరావాస కేంద్రాన్ని స్థానిక జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత సందర్చించి బాధితులకు భోజనాలు స్వయంగా తానే వడ్డించి, పునరావాస కేంద్రం వద్ద ముంపు ప్రాంత బాధితుల పేర్లు నమోదు చేసే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముంపు ప్రాంత వరద బాధితులు ఎవరు అధైర్యపడవద్దని, ముంపు గ్రామాలల్లో అధికారులు సర్వే నిర్వహించి ముంపు ప్రాంత బాధితులను గుర్తించి అండగా నిలుస్తుందన్నారు. ముంపుకు గురైన వారి అన్ని కుటుంబాలకు10 వేలు, 2 నెలలకు సరిపడా 20 కెజీ ల బియ్యం, నిత్యావసర సరుకులు ప్రభుత్వం తప్పకుండా అందించి అండగా ఉంటుందని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ నాయకులు గాదె నర్సిరెడ్డి, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.