పురుగుల మందు సేవించి విద్యార్థి ఆత్మహత్య
శంకరపట్నం జనం సాక్షి,న్యూస్ శంకరపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దపాక కు చెందిన గొర్ల మధు అనే విద్యార్థి శనివారం జమ్మికుంటలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు విద్యార్థి ఈ నెల రెండు తారీఖున పురుగుల మందు సేవించడంతో కుటుంబ సభ్యులు జమ్మికుంట ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానిక ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు మృతిని కుటుంబ సభ్యులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన అన్నారు