భారత్‌పై సుంకాల విషయంలో వాణిజ్య చర్చలుండవు
` విషయం కొలిక్కి వచ్చేంత వరకూ ఆ దిశగా పురోగతి ఉండదు
` రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని సుంకాలుంటాయి
` మరోసారి స్పష్టం చేసిన ట్రంప్
వాషింగ్టన్(జనంసాక్షి): భారీ సుంకాలతో భారత్‌పై అన్యాయంగా కాలుదువ్వుతున్న ట్రంప్ తాజాగా మరో బాంబు పేల్చారు. భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండవని స్పష్టం చేశారు. దీంతో, భారత్- అమెరికా సంబంధాలు మునుపెన్నడూ చూడని స్థాయిలో పతనమై ఆందోళన రేకెత్తిస్తున్నాయి. భారత్‌పై సుంకాల విధింపు అనంతరం చర్చలు కొనసాగుతాయా? అన్న విూడియా ప్రశ్నకు ట్రంప్ ఉండవని తెలిపారు. ’విషయం కొలిక్కి వచ్చేంత వరకూ చర్చలు ఉండవు’ అని స్పష్టం చేశారు. అంతకుముందు కూడా భారత్‌పై ట్రంప్ రెచ్చి పోయారు. రష్యాతో వాణిజ్యం నెరపే దేశాలపై మరిన్ని సుంకాలు ఉంటాయని హెచ్చరించారు. ఇతర దేశాలూ రష్యాతో వాణిజ్యం జరుపుతుండగా భారత్‌పైనే అక్కసు ఎందుకని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. భారతీయ ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 25 శాతం సుంకం విధిస్తోంది. అదనంగా మరో 25 శాతం సుంకం విధిస్తూ ట్రంప్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కొత్త సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో, భారత్‌పై మొత్తం సుంకం 50 శాతానికి చేరుకుంది. అమెరికా చర్యలను భారత్ ఖండిరచింది. సుంకాల విధింపు అన్యాయం, నిర్హేతుకర, చట్టపరంగా సమర్థనీయం కాదని తేల్చి చెప్పింది. జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు తాము అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ విషయంలో మా వైఖరిని ముందే స్పష్టం చేశాం. మా దిగుమతులన్నీ మార్కెట్ పరిస్థితులు, 1.4 బిలియన్‌ల భారతీయులకు ఇంధన భద్రత అందించడంపై ఆధారపడి ఉంటాయి’ అని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా సుంకాలపై ప్రధాని మోదీ కూడా ఘాటుగా స్పందించారు. గురువారం ఎమ్‌ఎస్ స్వామినాథన్ సెంటెనరీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన ప్రధాని.. దేశ ప్రయోజనాల కోసం తాను వ్యక్తిగతంగా ఎంతటి మూల్యం చెల్లించుకునేందుకైనా సిద్ధమేనని అన్నారు. ప్రభుత్వానికి దేశ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. రైతులు, మత్స్యకారులు, డెయిరీ రంగం విషయంలో భారత్ రాజీ పడదని స్పష్టం చేశారు.అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను కూడా భారత్ ఎండగట్టింది. రష్యా చమురును కొనుగోలు చేస్తున్న చైనా, టర్కీపై సుంకాలు ఎందుకు విధించట్లేదని ప్రశ్నించింది. ఇక చైనా ఉత్పత్తులపై గతంలో ప్రకటించిన 145 శాతం సుంకాలను అమెరికా ఇప్పటికీ అమలు చేయని విషయాన్ని కూడా భారత్ ప్రస్తావించింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అజిత్ ధోబాల్ భేటీ
గత కొన్ని రోజులుగా భారత్, రష్యా, అమెరికా మధ్య ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రష్యాతో భారత్ తన స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇదే సమయంలో అమెరికా నుంచి వస్తున్న ఒత్తిడిని కూడా ఎదుర్కొంటోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో మాస్కోలో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్-రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడిరది. ఒక రోజు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై 25 శాతం అదనపు సుంకం విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఈ విూటింగ్ జరిగింది. దీంతో భారత్ ఉత్పత్తులపై మొత్తం సుంకం 50 శాతానికి చేరింది. ఎందుకంటే, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం. ఈ సుంకాల విషయంలో అమెరికా ఒక షరతు కూడా పెట్టింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇప్పుడు నాలుగో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఈ యుద్ధాన్ని శుక్రవారం నాటికి రష్యా ఆపకపోతే రష్యా చమురు కొనే దేశాలపై ఆంక్షలు డబుల్ చేస్తామని అమెరికా హెచ్చరించింది. ఈ కొత్త సుంకాలు రెండు దశల్లో అమల్లోకి వస్తాయి. మొదటి 25 శాతం ఆగస్టు 7 నుంచి, మరో 25 శాతం 21 రోజుల తర్వాత. అయితే, చర్చల ద్వారా ఏదైనా మార్పు వస్తే మాత్రం ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది. అమెరికా ఈ నిర్ణయంతో భారత్-అమెరికా మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, ఈ సుంకాలను అన్యాయం, ఆమోదయోగ్యం కాదని విమర్శించారు. భారత ఆర్థిక స్వాతంత్రాన్ని కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, అమెరికా కూడా రష్యా నుంచి యురేనియం, పల్లాడియం, ఎరువులు దిగుమతి చేసుకుంటు-ందని, దీన్ని డబుల్ స్టాండర్డ్స్ అనకూడదా? అని విమర్శించారు.మరోవైపు అజిత్ దోవల్, రష్యా సెక్యూరిటీ- కౌన్సిల్ సెక్రటరీ సెర్గీ షోయిగుతో సమావేశంలో పుతిన్ ఈ ఏడాది భారత్‌కు రానున్నారని, తేదీ త్వరలో ఖరారు అవుతుందన్నారు. ఈ సందర్శన గురించి భారత్ చాలా ఉత్సాహంగా ఉందని, గతంలో జరిగిన భారత్-రష్యా సమావేశాలు రెండు దేశాల సంబంధాల్లో కీలకమైనవని దోవల్ అన్నారు. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
భారత్‌కు చమురు మరింత చౌకగా ..
ఓ పక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌లు, బెదిరింపులు.. మరోవైపు ఐరోపా సమాఖ్య ఆంక్షల వేళ రష్యా భారీ డిస్కౌంట్‌తో చమురును భారత్‌కు ఆఫర్ చేస్తోంది. ఈ విషయాన్ని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ కేపీఎల్‌ఈఆర్ లిమిటెడ్ పేర్కొంది. ఉరల్స్ గ్రేడ్ క్రూడ్ డేటెడ్ బ్రెంట్ చమురు కంటే ఐదు డాలర్లు చౌకగా ఉంది. ఇవి దాదాపు రెండు వారాల క్రితం ఒకే రకంగా ఉండేవి.అమెరికా చర్యలు ఊహాతీతంగా ఉండటంతో.. ఉరల్స్ చమురు ధరలు మరింత పతనం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అమెరికా సెకండరీ ఆంక్షల భయం కారణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రష్యా నుంచి కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది.అగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యలో రష్యా చమురు ప్లాంట్ల మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. ఈ క్రమంలో అక్కడినుంచి భారీఎత్తున ఆయిల్‌ను ఎగుమతి చేసేస్తారు. ఈ ఒత్తిడి కూడా ధరలపై పడుతోందని కేపీఎల్‌ఈఆర్ హుమయూన్ ఫాలాక్షాహి పేర్కొన్నారు.ప్రస్తుతం భారత్‌లో రష్యా చమురుకు 37 శాతం మార్కెట్ వాటా ఉంది. దీనిని ఒక్కసారిగా తగ్గించుకోవాలంటే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కేపీఎల్‌ఈఆర్ పేర్కొంది. ప్రస్తుతం చమురు సంస్థలు కూడా రష్యా నుంచి కొనుగోళ్లను నిలిపివేసే అంశాన్ని ఆలోచిస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు కొనుగోళ్లను కొనసాగిస్తున్నాయి. మరోవైపు అమెరికా నుంచి చమురు కొనుగోళ్లు మే నుంచి మాత్రం రోజుకు 2,25,000 పీపాలకు చేరాయి. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే ఇవి రెట్టింపైనట్లు లెక్క.