భారత్‌లో పర్యటించండి
` పుతిన్‌కు మోదీ ఆహ్వానం
` ట్రంప్ టారిఫ్‌ల వేళ.. ప్రధానికి రష్యా అధ్యక్షుడి ఫోన్
మాస్కో(జనంసాక్షి):రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు సంబంధించి తాజా పరిస్థితులను ప్రధాని మోదీ కి పుతిన్ వివరించినట్లు తెలిసింది. ఈ సంక్షోభం ముగింపునకు శాంతియుత చర్చలే పరిష్కార మార్గమని భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడిరచింది. భారత్-రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపైనా ఇరువురు నేతలు చర్చించారు. ఇరుదేశాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు తమ నిబద్ధతను చాటుకున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా 23వ భారత్-రష్యా వార్షిక సదస్సులో భాగంగా ఈ ఏడాది చివరలో భారత్‌లో పర్యటించాలని పుతిన్‌కు ప్రధాని మోదీ ఆహ్వానించినట్లు పీఎంవో వెల్లడిరచింది. అయితే, రష్యా నుంచి చమురు కొనుగోలు నేపథ్యంలో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించిన వేళ ప్రధాని మోదీ పుతిన్‌తో సంభాషించడం ప్రాధాన్యం సంతరించుకుంది.