పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలి
మల్దకల్ జులై 18 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని గ్రామపంచాయతిలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల జీతాలను వెంటనే ఇవ్వాలని,తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఇఫ్ట్ డిమాండ్ చేసింది. సోమవారం ఈ మేరకు ఇఫ్ట్ ఆధ్వర్యంలో కార్మికుల జీతాలకు ఉద్యోగ భద్రత గురించి వినతి పత్రాన్ని మల్దకల్ ఎంపీడీవో వినతి పత్రంఅందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఇఫ్టు జిల్లా కోశాధికరి జమ్మిచెడు కార్తీక్ మాట్లాడాతు. గ్రామాలల్లో అన్ని రకాల పనులు మల్టీపర్పస్ కింద చేస్తున్న ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొని గ్రామాల అభివృద్ధికి తొడ్పాడితే జీతాలు ఇవ్వకపోవడం వల్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,జిఓ నెంబర్ 51ప్రకారం కూడా కొందరి కార్మికులకు 8500 ఇవ్వడం లేదని ఇప్పటికైనా 5 వేలు 6వేలు కాకుండా 8500 రూపాయలు ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల జీతాలను వెంటనే ఇవ్వాలన్నారు.లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందన్నారు.డిమాండ్స్ అధికారులకు పంపిస్తాము చెప్పారు.గ్రామపంచాయతీ కార్మికులకు సంబంధించి నాలుగు నెలల జీతాల గురించి కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా ప్రయత్నిస్తానని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి హరీష్ గ్రామపంచాయతీ కార్మికులు శాంతన్న,రాము,సవరన్న, భీమన్న, వీరన్న ,కృష్ణ ,నాగన్న, పరమేష్ ,సుంకన్న ,పెద్ద కృష్ణ, పరశురాముడు, భీమేష్, తదితరులు పాల్గొన్నారు.