పెట్రోల్ ధరలు తగ్గించకుంటే పుట్టగతులుండవు
ప్రభుత్వం రాత్రికిరాత్రే పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించకుంటే పుట్టగతులుండవని సీపీిఐ పాలకుర్తి నియోజక కార్యదర్శి ముద్దం శ్రీనివాస రెడ్డి అన్నా రు. ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలకు నిరసన గా గురువారం సీపీిఐ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్‌లో భారీగా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పట్టికే ఆరు సార్లు పెట్రోల్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై అధిక భారం మోపుతుందన్నారు. ఇప్పట్టికే నిత్యవసర ధరలు పెంచి ఆకాశాన్ని అంటించారని రైతులు పండించి న పంటలకు మాత్రం గిట్టుబాటు ధరను కల్పించ కుండా ప్రజలతో చెలగాటం ఆడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పెంచిన ధరలు తగ్గించాలని లేకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్పుతారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీిఐ మండల కార్యదర్శి ఓమ భిక్షపతి, ముద్దం మహబూబ్ రెడ్డి, మల్లయ్య, ఎల్లయ్య, యాదగిరి, వీరన్న తదితర నాయకులు పాల్గొన్నారు.