‘పెట్రో’ ఊరట
ఆదిలాబాద్ జనం సాక్షి:ప్రజలకు ఊరట లబించింది. లీటర్‌కు రూ.3 తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఇవి అమలులోకి వచ్చింది. ఆదిలాబాద్‌లో ప్రస్తుతం లీటర్‌కు రూ.72.52ఉండగా,రూ.3తగ్గడంతో రూ.69.52కు చేరుకుంది. జిల్లాలో ప్రతిరోజు 80వేలలీటర్ల పెట్రోల్ వినియోగం అవుతుంది. రూ.3 తగ్గించడంతో రోజు రూ.2.40లక్షలు ప్రజలకు ఆదాకానున్నాయి. ఈ లెక్కన నెలకు రూ.72 లక్షలు, సంవత్సరానికిరూ.8.64కోట్లు మిగలనున్నాయి. ఒక దశలో లీటర్‌కు రూ.77కు చేరుకోవడంతో జనాలు బెంబేలెత్తారు. ధర దిగడంతో ప్రజల ఊరట చెందుతున్నారు.