పెద్దలోడిలో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి మునిపల్లి

, ఏప్రిల్ 03, జనంసాక్షి: భూమి కోసం, భూక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం దొడ్డి కొమురయ్య పోరాటం చేసి అమరుడయ్యారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కురుమ సంఘం నాయకులు చిట్కుల వెంకటేష్ అన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసారని గుర్తు చేశారు. మండలంలోని పెద్దలోడి గ్రామంలో దొడ్డి కొమురయ్య 96వ జయంతి ఘనంగా నిర్వహించారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులు మాట్లాడుతూ నిజాం వ్యతిరేక పోరాటంలో దొడ్డి కొమురయ్య తొలి అమరుడు అయ్యారని తెలిపారు. కొమురయ్య ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం యూత్ అధ్యక్షులు మొగులయ్య, ఉప సర్పంచ్ జగదీశ్వర్, బీఆర్ఎస్ నాయకులు నరేష్, బిజెపి నాయకులు రాజు, జగదీశ్వర్, ప్రహ్లాదు,కాశీనాథ్, మల్లేశం పాల్గొన్నారు.