పెన్షన్ల గురించి మాకు తెలియదు జిల్లా యంత్రాంగానికే తెలుసు అంటున్న : యంపిడీఓ లు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి. జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం.

కోఢేరు (జనం సాక్షి) ఆగస్టు 29 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల కేంద్రంలో  జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పి నర్సింహా మాట్లాడుతూ,
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి న నాటి నుండి పెన్షన్ల కోసం ఎదురుచూసిన వాస్తవ లబ్ధిదారులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రస్తుతం మంజూరైన పింఛన్ దారుల జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో జిల్లాలో వేలాదిమంది నిరాశ నిస్పృహలకు గురయ్యారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి నరసింహ ఆందోళన వ్యక్తం చేశారు.
40 వేల పైచిలుకు లబ్ధిదారులు వివిధ కేటగిరీల కింద పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే 23 వేల పింఛన్లు మంజూరు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకున్నదని ఆరోపించారు.
మంజూరైన పింఛన్లలో వాస్తవ లబ్ధిదారులకు చాలామందికి పింఛన్లు రాకపోగా అర్హత లేని వారు దొడ్డిదారిన పింఛన్లు మంజూరు చేసుకున్నారని పలువురు ఆరోపిస్తున్నట్లు ఆయన తెలిపారు.
మీసేవ కేంద్రాల ద్వారా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు పింఛన్లు మంజూరు కాకపోవడంతో మీ సేవ కేంద్రాల వెంబడి ఆయా ఎంపీడివోల కార్యాలయల వెంబడి పింఛన్ల కోసం ప్రదక్షిణలు చేస్తుంటే మీసేవ కేంద్రాల నిర్వాహకులు తాము దరఖాస్తు చేసేంత వరకే బాధ్యులమని మంజూరు మా చేతిలో లేదని చేతులు దులుపుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
ఎంపీడీవోల కార్యాలయాలకు వెళ్తే తమ కార్యాలయం నుండి పంపిన దరఖాస్తులకు మాత్రమే తాము జవాబిదారిదారులమని మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులకు తమకు ఎలాంటి సంబంధం లేదని జిల్లా అధికారులతో సంప్రదించాలని ఆయా మండలాల ఎంపీడీవోలు చేతులెత్తేస్తున్నట్లు పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.
ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో వాస్తవ లబ్ధిదారులను గుర్తించి తక్షణమే పింఛన్లు మంజూరు చేయాలని లేనిచో వాస్తవ లబ్ధిదారులను సమీకరించి ఆయా ఎంపీడీవో కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని ఆయన అధికారులను హెచ్చరించారు.