పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల కాస్మోటిక్ మెస్ చార్జీలను పెంచాలి

– బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గాలి శ్రీనివాస్ నాయుడు
మునగాల,జులై21(జనంసాక్షి)
మండల పరిధిలోని ఆకుపాముల లో గ్రామ పంచాయతీ ఆవరణలో పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల కాస్మోటిక్ మెస్ చార్జీలను పెంచాలని జరిగిన బీసీ విద్యార్థి సంఘం నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రర కార్యదర్శి గాలి శ్రీనివాస్ మాట్లాడుతూ   విద్యార్థుల ఆత్మ బలిదానాల వల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు సొంత హాస్టల్ భవనం లేకుండా ఉండడం వలన విష పురుగులు పాములు కాటు వేసే ప్రమాదం ఉందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మండలానికి ఒక గురుకులం హాస్టల్ పెట్టించి అప్లికేషన్ పెట్టుకున్న  ప్రతి ఒక్క విద్యార్థి కి అడ్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించకుంటే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పొలంపల్లి సుధాకర్ గౌడ్ దొంతగాని నాగేశ్వరావు బాల బోయిన వినయ్ చిక్కుల నరేష్ రజక  పరశురాం వీరబాబు రాములు సిద్దు తదితరులు పాల్గొన్నారు.