పేదలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం..

అర్హులందరికీ ఆసరా పెన్షన్లు..
– రాంరెడ్డిపల్లిలో 48 డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపన.*
– పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.
– ఎమ్మెల్యే డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి.
ఊరుకొండ, సెప్టెంబర్ 8 (జనం సాక్షి):
దేశంలో ఎక్కడా లేనివిధంగా
బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు, ఒంటరి మహిళలు, వృద్ధులకు, దివ్యాంగులకు, అండగా ఉంటూ దీర్ఘకాలిక రోగులకు మానవతా దృక్పథంతో పెన్షన్‌ అందజేస్తున్న ఘనత ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఒక్కరికే దక్కుతుందని ఎమ్మెల్యే డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం ఊరుకొండ మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి పర్యటన సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో రాంరెడ్డిపల్లి, జగ బొయిన్ పల్లి, బొమ్మరాసిపల్లి, బాల్యలోక్యతండా లకు ప్రభుత్వం నుండి నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీపీ బక్క రాధజంగయ్య, జడ్పిటిసి శాంతకుమారి రవీందర్, స్థానిక ఎంపిటిసి సభ్యులు కల్మిచర్ల గోపాల్ గుప్తా, సర్పంచ్ శివరాణి హరీష్ ల చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాంరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబోయే (48) డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామంలో నూతనంగా నిర్మించిన పలు సీసీ రోడ్లను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లను గౌరవ ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. ఊరుకొండ మండల కేంద్రంలో ఆసరా పింఛన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర మేనని వ్యాఖ్యానించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, బీడీ పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్స్ మొదలగు సంక్షేమ పథకాలను అందిస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు.
కావున పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. ప్రభుత్వానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ప్రజలను కోరారు.
– మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..
స్థానిక నేతలు పార్టీ కార్యాలయాన్ని వినియోగించుకోవలని, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పిలుపునిచ్చే కార్యక్రమలను ప్రజలల్లోకి విరివిగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. టిఆర్ఎస్ మండల కార్యాలయాన్ని ఆధునిక హంగులతో, సాంకేతికతో నెలకొల్పారని, ఈ సందర్భంగా టిఆర్ఎస్ మండల నేతలను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అభినందించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తహాసిల్దార్ జాకిర్ అలీ,
టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.