పేదల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): విభజన సమయంలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా సీఎం కేసీఆర్ మార్చారని టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని 16వ వార్డులో వార్డు వార్డుకు కాంగ్రెస్ పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.ఉద్యోగుల సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.పట్టణంలో కోట్ల రూపాయలతో చేపట్టిన అండర్ డ్రైనేజ్ నిర్మాణాలు ఏళ్లు గడుస్తున్న పూర్తి కాలేదని, మురుగు నీరు రోడ్లపైనే ప్రవహిస్తుందన్నారు.ల్యాండ్ సాండ్ మైనింగ్ మాఫియాకు సూర్యాపేట అడ్డాగా మారిందన్నారు.పట్టణంలో అర్హులైన పేదలు వేల మంది డబల్ బెడ్ రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం192 ఇల్లు మాత్రమే పంపిణీ చేశారని అన్నారు.గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కాలనీ పేరుతో 4 వేలకు పైగా ఇండ్లను పంపిణీ చేసిందని తెలిపారు.నాళాల ఆక్రమణతో చిన్న వర్షానికి కూడా ఇండ్లు మునిగిపోతున్నాయని తెలిపారు.మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డ్ ఇంచార్జ్ పగిళ్ళ శరత్ ,
ముదిరెడ్డి రమణారెడ్డి , షఫీ ఉల్లా, పాలవరపు వేణు, చొక్కయ్య , స్వామినాయుడు , ఫరూక్ , గోపాలరెడ్డి, గట్టుశ్రీనివాస్ , వల్దాస్ దేవేందర్, సైదిరెడ్డి, శ్రీకాంత్, మహర్షి, సిద్దు , సంజయ్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.