పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ అందాలి
ప్రపంచ దేశాలు కలసికట్టుగా ముందుకు సాగాలి
ఫ్రాన్స్ సదస్సులో టెడ్రోస్ అధనోమ్ వెల్లడి
కోళ్ల యాంటీ బాడీలపై పరిశోధిస్తున్న శాస్త్రవేత్తలు
జెనీవా,నవంబర్13(జనంసాక్షి): కరోనా మహమ్మారి తదనంతర పరిణామాలపై పోరాడటానికి అల్ప, మధ్య ఆదాయ దేశాలకు టీకా లభ్యత అత్యవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ అభిప్రాయపడ్డారు. కొవిడ్-19 టీకాకు సంబంధించి పారిస్ పీస్ ఫోరమ్‌లో ఆయన మాట్లాడుతూ..ఆర్థిక పునరుద్ధరణకు టీకా పంపిణీ జరగాల్సిన అవసరాన్ని వెల్లడించారు. ఇతర వస్తువుల వలే కొవిడ్ టీకా, చికిత్సా విధానాలు, ఇతర వైద్య సౌకర్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికి సమానంగా, అందుబాటు ధరలో లభించాల్సి ఉందన్నారు. వైద్య సిబ్బంది, వృద్ధులు, ప్రమాదం పొంచి ఇతర వర్గాల ప్రజలకు ఈ సౌలభ్యం ముందుగా అందుబాటులో ఉండాలి. దీనిలో నైతికత, ప్రజారోగ్య అత్యవసరమే కాకుండా ఆర్థికావసరం కూడా ఉందన్నారు. పరస్పరం ఆధారపడ్డ ప్రపంచంలో అల్ప, మధ్య ఆదాయ దేశాలకు టీకా ఆలస్యమైతే, ఆర్థిక పునరుద్ధరణపై ఆ ప్రభావం పడుతుంది. టీకా జాతీయవాదం ఈ మహమ్మారిని మరింత కాలం పొడిగిస్తుంది. ఏ ఒక్క దేశమూ ఒంటరిగా ఈ సవాళ్లను పరిష్కరించలేదంటూ సంపన్న దేశాలను ద్దేశించి హెచ్చరించారు. కొవిడ్ 19 మహమ్మారిని ఎదుర్కోవడానికి అవసరమైన పరికరాలు, సామగ్రిని సమానంగా పంపిణీచేయడానికి ఆరోగ్య సంస్థ, యూరోపియన్ కమిషన్, ఫ్రాన్స్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ యాక్సెస్ టు కొవిడ్-19 టూల్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. అయితే, నిధుల కొరత వల్ల ఈ కార్యక్రమానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం సైంటిస్ట్‌లు నిర్విరామంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో పలు దేశాలకు చెందిన సైంటిస్ట్‌లు కరోనా వ్యాక్సిన్ కోసం చేస్తున్న శ్రమవృధా అవుతున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో ఉపయో గంలోకి రావాలంటే తప్పని సరిగా మూడు దశల్లో హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించాలి. ఈ ట్రయల్స్ ఫెయిలవుతున్నట్లు తెలుస్తోంది. అయినా సరే టీకాతోపాటు మాత్రలు, నాజల్ డ్రాప్స్‌ను తయారు చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాల్లో కోడి నుంచి యాంటీబాడీస్ తీసుకుని కరోనా తీవ్రతను తగ్గించవచచ్చని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ లు నిర్దారించారు. ఎలుకలు, పందులతో మనుషులకు చాలా పోలికలు ఉన్నట్టే కోళ్లతోనూ మనుషులకు చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. మనుషుల్లో మాదిరే కోళ్లలోనూ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. కోడిగుడ్లలోని యాంటీబాడీలు కరోనా నుంచి కొంత కాలం రక్షణ కల్పిస్తాయని స్టాన్‌ఫర్డ్ సైంటిస్ట్ డేరియా మూచీ రోజెన్ తెలిపారు. ప్రస్తుతం కరోనా నిరోధక నాజల్ స్పేన్రు 48 మంది పేషంట్లపై ప్రయోగాలు నిర్వహిస్తున్నామని, పూర్తి ఫలితాలు వచ్చాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.