పేద లను కొట్టి పెద్దలకు పంచుతున్న కేసీఆర్ సర్కార్
బి ఆర్ ఎస్ కు 870 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
నర్సాపూర్. అక్టోబర్, 7, ( జనం సాక్షి )
టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, తుందని ఒక బెల్ట్ షాప్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభా యాదాద్రికి రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం 45 కోట్ల మారిందని హుజురాబాద్ ఎమ్మెల్యే బిజెపి చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారంనాడు ఆయన నర్సాపూర్ వచ్చిన సందర్భంగా ఈ నెల 9న నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ కేంద్రమంత్రి భూపేష్ యాదవ్, రాష్ట్ర ఇంచార్జ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నా ఆధ్వర్యంలో చేరుతుండగా సభాస్థలిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాల కాలంలో వేలాది బెల్టుషాపులు ఏర్పాటు చేసి లక్షలాది మంది తాగుబోతుల చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అని ఆరోపించారు. మద్యం మత్తులో ఎంతో మంది తమ ప్రాణాలు వదిలినట్లు అని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా మంత్రులుగా కొనసాగుతుండడం సిగ్గుమాలిన చర్య అభివర్నిచారు.
బుద్ధి జ్ఞానం ఉన్న ప్రజలు మునుగోడు లో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని భారీ మెజారిటీతో అక్కడ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
టిఆర్ఎస్ పార్టీ కచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజాధనాన్ని వృధా చేయడం లో టిఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో ఉంటుందని వంద సంవత్సరాల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్కు 40 సంవత్సరాల చరిత్ర గల బిజెపికి లేని పార్టీ పండు కేవలం ఎనిమిది సంవత్సరాలు ఉన్న బి ఆర్ ఎస్ కు 870 కోట్ల ఆస్తులు ఎక్కడి అని ఆయన ప్రశ్నించారు.
పేద బడుగు బలహీన వర్గాల నుంచి ఎంతో విలువైన భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పరిశ్రామిక వేత్తలకు అప్పగిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన మండిపడ్డారు.
చేరికల పరంపర కొనసాగుతుంది.
ఉమ్మడి మెదక్ జిల్లా లోనే గజ్వేల్ ,జయరాబాద్, నారాయణఖేడ్, జోగిపేట్, తదితర ప్రాంతాల నుంచి సర్పంచులు ఎంపీటీసీలు మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం కొనసాగుతుందని హజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలిపారు.
ఈనెల 9న చేరికలు
నర్సాపూర్ పట్టణానికి మునిసిపల్ చైర్మన్, టిఆర్ ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మురళి యాదవ్ తోపాటు కౌన్సిలర్ మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి, నర్సాపూర్ నియోజవర్గానికి చెందిన ఆయా కుల సంఘాల
ఎంపీటీసీలు సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు
పెద్ద సంఖ్యలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్రం ఇంచార్జి తరుణ్ చుగ్, ల ఆధ్వర్యంలో చేరనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, కౌన్సిలర్లు రాజేందర్ బుచేశ యాదవ్, లత రమేష్ యాదవ్, సురేష్ యాదగిరి, బీజేపీ సీనియర్ నాయకులు మల్లేష్ గౌడ్, కొత్త శ్రీనివాస్ గుప్తా, శంకర్ తదితరులు ఉన్నారు.
ఫోటో రైట్ అప్ ఎన్ ఎస్ పి 1 విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
ఫోటో రైట్ అప్ ఎన్ ఎస్ పి 2 సభ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేస్తున్న హజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్