పొడుకు హక్కు వచ్చేనా ఉన్న పోడు పోయేనా…?
గంగారం అక్టోబర్ 2 (జనం సాక్షి)
రాష్ట్ర ప్రభుత్వం గతంలో పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని గతంలో గిరిజన గిరినేతురుల రైతుల నుండి అర్జీలను స్వీకరించడం జరిగినది రైతులకు సంబంధించిన భూములలో ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు ఇద్దరి అనుసంధానంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే చేస్తున్న అధికారులు. ప్రభుత్వ అధికారులు సర్వే చేసినప్పటికీ రైతులు అయోమయంలో ఉన్నారని తెలుస్తున్నది. కొందరు రైతులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు హక్కు పత్రాలు వచ్చాయని, ఇప్పటి ప్రభుత్వాలు మేము సాగు చేసుకుంటున్న భూములలో ఫారెస్ట్ అధికారులతో మాకు అన్నం పెట్టే భూములలో కందకాలు తీయించారని వాపోయారు. కందకాలు తీసే భూములకు అడ్డం పోగా రైతులపై దాడులు చేయించి మా భూములను లాక్కున్నారని ఇకనైనా ఉన్న భూములకైన హక్కు పత్రాలు ఇచ్చి మాకు న్యాయం చేయాలని రైతులు కోరారు. ఈ పోడు భూముల సర్వే పోనుగొండ్ల, దుబ్బగూడెం గ్రామపంచాయతీ గుడాలలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సూర్యనారాయణ ఫారెస్ట్ అధికారులు, సర్వేయర్, గ్రామస్తులు పాల్గొన్నారు